టిఆర్ఎస్ పార్టీ మండల
కమిటీ ఆధ్వర్యంలో
విజయోత్సవ ర్యాలీ
![]() |
| ముత్యం పెళ్లి గ్రామంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య వైస్ ఎంపీపీ విక్రమ్ రావు ఆధ్వర్యంలో విజయోత్సవం |
మునుగోడు నియోజకవర్గం TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి10 వేల పై చిలుకు మెజార్టీతో విజయాన్ని కాంక్షిస్తూ కాసిపేట టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో దేవాపూర్, ముత్యంపల్లి, కొండాపూర్ గ్రామాలలోTRS పార్టీ శ్రేణుల విజయోత్సవాలు నిర్వహించుకున్నారు. ముత్యం పెళ్లి గ్రామంలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రం రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకుంటూ టపాసులు పేల్చుకుంటూ జై కేసీఆర్, జై దుర్గం చిన్నయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేవాపూర్ లో మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఓరియంట్ కర్మాగారం ముందు టపాసులు పేల్చి భారీ ప్రదర్శన, బైక్ ర్యాలీ చేసినారు. కొండాపూర్ యాపా చౌరస్తాలో సీనియర్ మండల నాయకుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగులు వెదజల్లుకుంటూ టపాసులు పేల్చి విజయోత్సవం జరుపుకున్నారు.
ముత్యంపల్లి లో..
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొండ బత్తుల రామచందర్, నవనందుల చంద్రమౌళి, ముత్యం పల్లి సర్పంచి ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిన బాపూ, కోమటి చేను సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్,మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తయ్య, కాసిపేట ఉప సర్పంచ్ పిట్టల సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి మోటూరి వేణు, ఏఎంసీ కమిటీ సభ్యుడు వాసుదేవ్, లంక లక్ష్మణ్, జాడి రామచందర్, అగ్గి సత్తయ్య,
దేవాపూర్ లో..
దేవాపూర్ పట్టణ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, మద్దిమడ సర్పంచ్ అడే జంగు,మండల టిఆర్ఎస్ నాయకులు బింగి శ్రీనివాస్, నాయిని మల్లేష్,
కొండాపూర్ చౌరస్తాలో..
సర్పంచి మక్కల శ్రీనివాస్, తాటి గూడ ఉపసర్పంచ్ శ్యామ్, నాయకులు మంగ శ్రీకాంత్, మల్లేష్, సక్రియ నాయక్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



