ఆదర్శ పాఠశాల పోస్టులను గిరిజనులకే కేటాయించాలి.
- తుడుం దెబ్బ మండల శాఖ డిమాండ్.

కొండాపూర్ గ్రామంలో తుడుం దెబ్బ మండల శాఖ సమావేశం.
Scv News Kasipet:--
ఏజెన్సీ మండలమైన కాసిపేట ఆదర్శ పాఠశాల నూతన వసతి గృహం నిర్వహణకు మంజూరైన పోస్టులను గిరిజనులకే కేటాయిం చాలని తుడుం దెబ్బ మండల శాఖ డిమాండ్ చేసింది. ఈరోజు కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో తుడుం దెబ్బ మండల నాయకులు సమావేశమై తీర్మానించారు. సంబంధిత అధికారులు గిరిజనేతరులకు పోస్టులు ఇస్తే ఊరుకునేది లేదని విద్యార్థులతో ఆదర్శ పాఠశాల ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడావి వెంకటేష్, ఉపాధ్యక్షుడు పెంద్రం వెంకటేష్ , సలహాదారు మడవి గంగారం, గెడమ్ పాండు, మహిళా సభ్యురాలు కత్లి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.