మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తెలంగాణ ఉద్యమకారుడు సిరాజ్ ఖాన్ కుటుంబానికి కొండాపూర్ వాసుల భారీ విరాళం.


 తెలంగాణ ఉద్యమకారుడు

కుటుంబానికి సహాయం చేసి

మండలానికి ఆదర్శంగా

నిలిచిన కొండాపూర్ ప్రజలు.

 

 సిరాజ్ ఖాన్ కూతురు వివాహానికి విరాళాలు అందజేస్తున్న కొండాపూర్ పంచాయితీ నాయకులు


Scv News Kasipet :--

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు నీతి నిజాయితీగా ఉద్యమించిన కాసిపేట మండలం ముత్యం పెళ్లి నివాసి సిరాజ్ ఖాన్ కూతురు వివాహానికి కొండాపూర్ పంచాయతీలోని నాయకులు ప్రజా ప్రతినిధులు 21 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు.తెలంగాణ ఉద్యమకారుడి కూతురు వివాహం కోసం కొండాపూర్ వాసులు భారీ విరాళం అందజేసి మండలంలో ఆదర్శంగా నిలిచారు. తమ కూతురు వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని సిరాజ్ ఖాన్ పంచాయతీ నాయకులను ఆశ్రయించా డు. కొండాపూర్ నాయకులు సర్పంచి మక్కల శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుమన్ మాజీ సర్పంచ్ బందెల ప్రేమ్ కుమార్, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ధర్మయ్య, వ్యాపారవేత్త అప్పల శేఖర్, వెంబడి కిషన్, లక్ష్మణ్, రాజా గౌడ్,రమేష్, శ్రీనివాస్ వీరమల్లు, పోశం, తిరుపతి  తదితర నాయకులంతా స్పందించి తాము విరాళం తమతో పాటు ఇతరుల దగ్గర కూడా విరాళాలు సేకరించి ఈరోజు 21వేల రూపాయలను సిరాజ్ ఖాన్ కు అందజేశారు.

 ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రా సాదన కోసం అహర్నిశలు కృషి చేసిన నిజాయితీ గల ఉద్యమకారుడు  సిరాజ్ ఖాన్ కూతురు వివాహానికి కొండాపూర్ వాసులు భారీ విరాళం అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సిరాజ్ ఖాన్ ఎన్నో ఇబ్బందులకు గురై ఉద్యమించాడన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నిరుపేదైన సిరాజ్ ఖాన్ కు ఎలాంటి ఉపాధి దొరకలేదని కుటుంబ పోషణ కోసం ముత్యం పెళ్లిలో బజ్జీల షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడ న్నారు. మండల కో ఆప్షన్ సభ్యుడుగా ఉన్నా ఎలాంటి ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాన్ని వెళ్ళదీస్తు న్నాడన్నారు.. సిరాజ్ ఖాన్  కూతురు వివాహకు సహాయం చేయాలన మండలంలోని పలువురుని ఆశ్రయించ డంతో . మానవతా దృక్పథంతో సిరాజ్ ఖాన్ కూతురు వివాహం కోసం బెల్లంపెల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్న 20వేల రూపాయలను, మండల ప్రెస్ క్లబ్ 10,000 రూపాయలు  అందజేయడం గొప్ప విషయం అన్నారు. ఇలాంటి  నిజాయితీ గల తెలంగాణ ఉద్యమకారుడు కుటుంబాన్ని ఆదుకో వాల్సిన బాధ్యత మండల సమాజంపై ఉందని అన్నారు.మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అతని కూతురు వివాహానికి తోచినంత సహాయం చేసి ఆదుకోవాలని అన్నారు.

 సిరాజ్ ఖాన్ మాట్లాడుతూ కొండాపూర్ వాసులు నా కూతురు వివాహానికి ఎదుర్కొంటున్న దీన పరిస్థితులను వివరించడంతో స్థానిక నాయకులు స్పందించి 21 వేల రూపాయలను విరాళం అందజేయడం  నాకు సంతోషాన్ని కలిగించిందన్నారు.. గ్రామ ప్రజలకు, నాయకులకు నా కుటుంబాన్ని ఆదుకున్నందుకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Note:- సిరాజ్ ఖాన్ కూతురు వివాహం రేపే ఉన్నందున మండలంలోని రాజకీయ నాయకులు ప్రజల ప్రతినిధులు మానవతావాసులు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకుంటే అతని గూగుల్ పే , ఫోన్ పే నెంబర్  6281589397 కు విరాళాలు అందజేయగలరని మనవి.