మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పరిహారం చెల్లింపులో దుబ్బగూడం నిర్వాసితులకు అన్యాయం

 పరిహారం. పరిహాసం..!

 కళ్యాణిఖని ఓసి

భూనిర్వాసితులకు పరిహారం

చెల్లింపులో అన్యాయం..!

 - స్థిర నివాసం ఉన్న నిర్వాసితులకు తక్కువ, బోగస్ ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ పరిహారం ?.

- బోగస్ ఇళ్లకు పరిహారం చెల్లింపులో సింగరేణికి 2.5 కోట్ల నిధుల భారం.

- ప్రజాధనాన్ని స్వాహా ప్రయత్నిస్తున్న బోగస్ ఇళ్ళ నిర్మాణం చేసిన రాజకీయ దళారులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని గ్రామస్తుల డిమాండ్.

- రీ సర్వే చేసి న్యాయం చేయాలని నిర్వాసితులు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వేడుకలు.

 పరిహారం తక్కువ వచ్చిందని రీ సర్వే చేసి న్యాయం చేయాలని కోరుతున్న దుబ్బ గూడెం  నిర్వాసితులు. 

 కేకే ఓ సి ముంపుకు గురవుతున్న దుబ్బగూడం గ్రామం.

Scv News Kasipet:---

 సింగరేణి యాజమాన్యం చేపట్టిన కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ నిర్వాసిత గ్రామమైన దుబ్బగూడం వాసులకు పునరావాస చెల్లింపులో తీవ్రంగా అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం చెల్లింపు కోసం రెవెన్యూ అధికారుల సర్వే తప్పుల, తడకగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ దళారుల ప్రలోభాలకు లొంగి నివాసం లేని బొగస్ ఇళ్లకు ఎక్కువ పరిహారం, స్థిర నివాసం ఉన్న పేదలకు తక్కువ పరిహారం  చెల్లించేలాఇటీవల ముందస్తు నోటిసులు ఇవ్వడం పట్ల నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. రీ సర్వే చేసి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను, స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను వేడుకుంటున్నారు...

కాసిపేట మండలం దుబ్బగూడం గ్రామం మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా ఉంది. గ్రామం కింద అపార మైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అప్పట్లో సోమగూడెం ఒకటి,1A గనులు గ్రామ శివారుల వరకు నడిచి గ్రామం కింద బొగ్గు నిక్షేపాలు తీయలేకపోయాయి. మూతపడిన  కళ్యాణ్ ఖని,సోమ గూడెం  బొగ్గు గనుల కింద ఉన్న అపారమైన బొగ్గు నిక్షేపాలు తీసేందుకు సింగరేణి యాజమాన్యం  కళ్యాణి గని ఓపెన్ కాస్ట్ గని ప్రారంభిం చింది. ఓపెన్ కాస్ట్ తవ్వకం వల్ల తమ గ్రామం  ముంపుకు గురవుతుందని ఓపెన్ కాస్ట్ కు  వ్యతిరేకంగా దుబ్బగూడం వాసులు 10 ఏళ్లుగా నిర్విరామంగా  పోరాటం చేశారు. కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు అవసరం ఉన్న దృష్ట్యా ఓపెన్ కాస్టులను ను వ్యతిరేకిం చవద్దని, మెరుగైన పునరావాస ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటుందని  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చాడు. దానికి గ్రామస్తులు సమ్మతించారు. 2015లో అప్పటి ఉమ్మడిజిల్లా కలెక్టర్ జగన్మోహన్ గ్రామస్తులకు మెరుగైన పునరావాస ప్యాకేజీ పై చర్చించి ఒప్పించారు. గ్రామాన్ని ఖాళీ చేయించే బాధ్యతను అప్పటి మంచిర్యాల ఆర్డీవో మస్రాత్ ఖానాంకు అప్ప చెప్పారు. దుబ్బగూడం వాసులతో ఆర్డీవో సమావేశమై గ్రామంలో నిర్మించిన ప్రతి ఇంటికి ఐదు లక్షల పరిహారంతో పాటు పునరావాస ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించి ప్రభుత్వానికి  సహకరించేం దుకు ముందుకు వచ్చారు.

* రాజకీయ దళారుల రంగ ప్రవేశం  బొగస్ ఇళ్లకు శ్రీకారం.

 పరిహారం స్వాహా కోసం రాజకీయ దళారులుపునాదులు లేకుండా నేలపై నిర్మించిన బోగస్ ఇండ్లు.

దుబ్బగూడం వాసులు తమ గ్రామం బొందల గడ్డగా మారకుండా ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే శవాలపై చిల్లర డబ్బులు ఏరుకునే వారి విధంగా ప్రజాధనాన్ని స్వహా చేసి బ్రతికే మండల రాజకీయ దళారులు( బ్రోకర్లు ) కొందరు వారి పోరాటానికి మద్దతు ఇవ్వకుండా బోగస్ ఇండ్లనిర్మాణానికి శ్రీకారం చుట్టారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. దుబ్బగూడెం గ్రామంలో ని ప్రతి ఇంటికి ఐదు లక్షలు ఇస్తామన్న ఆర్డీవో ప్రకటనతో  గతంలో 10 ఏళ్ల క్రితం గ్రామంలో నివసించి పదవి విరమణ పొంది  కరీంనగర్, వరంగల్ జిల్లాలో నివసించే వారి పేరు మీద  బోగస్ ఇళ్ల  నిర్మాణం చేపట్టారు. పునాదులు లేకుండానే నేలపై ఇటుకలు పేర్చి డబ్బా ఇళ్లను నిర్మించి వాటికి పంచాయతీ నుండి నంబర్లు తీసుకోవడం ప్రారంభించారు. పరిహారం ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని బోగస్ ఇళ్ల నిర్మాణం పై సింగరేణి యాజమాన్యం  అభ్యంతరం వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో  2017 సెప్టెంబర్ 3న  కాసిపేట పంచాయతీ రికార్డులను సీజ్ చేశారు. అప్పటికే గ్రామంలో 203 ఇళ్లకు పంచాయతీ సిబ్బంది నంబర్లు వేశారు. పరిహారం స్వాహా చేయాలని రాజకీయ దళారులు ముందస్తుగానే ప్రణాళికలు తయారు చేసుకున్నారు. వారి ప్రలోభాలకు లొంగి పంచాయతీ అధికారులు అప్పటివరకు 155 కుటుంబాలు మాత్రమే నివసిస్తుంటే 203 కుటుంబాలు నివసిస్తున్నాయని తప్పుడు నివేదికను తయారు చేశారని గ్రామస్తులు తెలిపారు . 48 ఇళ్లను ఎక్కువ చేసి ఇంటికి ఐదు లక్షల చొప్పున 2.4 కోట్ల పునరావాస నిధులను స్వాహా చేసేందుకు రాజకీయ దళారులు  ప్లాన్ వేసుకున్నారు. ఎక్కువ చూపిన ఇండ్లలో కొన్ని ఉమ్మడి కుటుంబాల నెంబర్లు ఇచ్చారు. పంచాయతీ రికార్డులు గ్రామంలో  ఇండ్లు లేని 84,85,106, 119, 176,177, అనే ఇంటి నెంబర్లు గల ఇండ్లు అప్పుడు గ్రామంలో లేనేలేవు. ఈ నెంబర్లను రాజకీయ దళారులు నిర్మించిన బోగస్ ఇండ్లకు ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. బోగస్ ఇండ్లపై గ్రామస్తులు, సింగరేణి యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తే అప్పటి తహసిల్దార్ కవిత వాటికి నష్ట పరిహారం చెల్లించమని, గ్రామ సర్వేలో వాటిని చూపమని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పరిహారం నోటీసు చూస్తే  తహసిల్దార్ కవిత మాటలు నీటి మూటలే అయ్యాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇటీవల  పునరావాస ప్యాకేజ్ కింద ఇళ్లకు ఇచ్చే పరిహారం నోటీసులో గ్రామంలోని 48 బోగస్ ఇళ్లకు పరిహారం మంజూర అయిందని నిర్వాసి తులు ఆరోపిస్తున్నారు. తరతరాలుగా స్థానికంగా నివాసం ఉన్న నిర్వాసిత కుటుంబాల కంటే  రాజకీయ దళారులు నిర్మించిన బొగస్ ఇండ్లకే  ఎక్కువ పరిహారం వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బోగస్ఇండ్ల పరిహారం చెల్లింపులో సింగరేణికి 2.5 కోట్ల నష్టం.

 బోగ స్ ఇల్లు నిర్మించిన వారిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని నిర్వాసితుల డిమాండ్.

 మనుషులు నివసించని చుట్టూ చెట్ల పొదలు మొలిచిన ఈ బోగస్ ఇంటికి 8 లక్షల పరిహారం చెల్లించేందుకు సిఫారసు. 

రెవెన్యూ అధికారులు, రాజకీయ దళారుల ప్రలోభాలకు లొంగి బోగస్ ఇళ్లను కూడా పరిగణలకు తీసుకుని ఒక్కొక్క ఇంటికి ఐదు నుండి తొమ్మిది లక్షలు పరిహారం సిఫారసు చేయడం పట్ల అసలైన నిర్వాసితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోగస్ ఇండ్లలో ఎవరు నివసించడం లేదు. ఇండ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిసాయి. కొన్ని డబ్బా ఇండ్లు పగుళ్లు తెలి శిథిలావస్థకు  చేరుకున్నాయి.బోగస్ ఇల్లకు పరిహారం చెల్లించడం వల్ల  సింగరేణి యాజమాన్యా నికి సుమారు రెండున్నర కోట్ల పరిహారం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. బోగస్ ఇండ్లపై  గ్రామస్తులతో పాటు సింగరేణి యాజమాన్యం కూడా అభ్యంతరం  వ్యక్తం చేసి వారికి చెల్లించే 2.5 కోట్లు నిధులను తమ పునరావాస కాలనీకి వివిధ అభివృద్ధి పథకాలకు కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బోగస్ ఇళ్ల నిర్మాణం పేరిట ప్రభుత్వ నిధులు అయిన ప్రజాధనాన్ని స్వాహాకు ప్రయత్నించిన రాజకీయ దళారులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని దుబ్బగూడం నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జోక్యం చేసుకొని రీ సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

 బాధితుల ఆవేదనలు.

 తమకు 30 లక్షల బదులు 4.7 లక్షలు ఇవ్వడం అన్యాయం.

 తాళ్ల పెళ్లి శ్యామల దినేష్.


తమ తాత ముత్తాతల నుండి ఈ గ్రామంలోని నివసిస్తున్నాము. నాలుగు రూముల పెద్ద ఇల్లు బాత్రూం లెట్రిన్ ఖాళీ స్థలం ఉన్న రూ. 4,74,186 సిఫారసు చేయడం అన్యాయం రీసర్వే చేసి తమకు న్యాయం చేయాలి.

 బోగస్ ఇళ్ల కంటే కంటే తమకు  కంటే తమకు తక్కువ పరిహారం  ఇచ్చారు.

 - మహమ్మద్ షాహిన్ రఫీ.


గ్రామంలో ప్రజలు నివసించని బోగస్ ఇండ్లకు  ఎక్కువ పరిహారం చెల్లించి మనుషులను నిస్వసించే వారికి తక్కువ ఇచ్చారు. తమ ఇల్లు రెండు గదులున్న రూ. 4,42,116 మాత్రమే సిఫారసు చేశారు. డబ్బా బోగస్ ఇండ్లకు  ఎనిమిది నుండి తొమ్మిది లక్షలు ఎలా ఇస్తారు. అధికారులు మళ్లీ సర్వే చేసి తమకు న్యాయం చేయాలి.

 తమకు పరిహారం తక్కువ ఇచ్చే అన్యాయం చేశారు.

 - వెంకటరాజు


గ్రామంలో తమ కుటుంబం 50 ఏళ్ల పైగా ఉంటున్నాము. తమకు నాలుగు రూముల ఇండ్లు ఖాళీ స్థలము, గునా ఇండ్లు ఉన్న కేవలం ఎనిమిది లక్షల పరిహారమే సిఫారసు చేయడం అన్యాయం. కూలిపోయే బోగస్ డబ్బా ఇళ్లకు తొమ్మిది లక్షలు ఇచ్చారు. రీ సర్వే  చేసి తమ ఇళ్లకు 20 లక్షలు ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నాను.

తమ గూన ఇల్లును పరిగణలకు తీసుకోలేదు.

 - సల్లూరి జ్యోతి.


రెవెన్యూ అధికారులు సర్వే చేసే సమయంలో తమ గుణ ఇల్లును పరిగణలోకి తీసుకోకుండా రేకుల షెడ్డు కు మాత్రమే 11 లక్షల పరిహారం సిఫారసు చేశారు.వెనుక ఉన్న గూన  ఇల్లును పరిగణలోకి తీసుకుంటే తమకు ఎక్కువ పరిహారం వస్తుందని మళ్లీ రి సర్వే చేసి న్యాయం చేయాలి.

 తమకు పరిహారం చెల్లించడంలో అన్యాయం.

 - అమ్మక్క.


తాము తాతల ముత్తాతల నుండి ఉంటున్నామని తమకు పెద్ద ఇల్లు తోపాటు ఖాళీ స్థలం ఉన్న తక్కువ పరిహారమే చెల్లించారు.నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు వారికి పని లేదు. 10 లక్షల పరిహారంతో తాము ఎలా బతకాలి.

దుబ్బ గూడెం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలి.

గ్రామ కమిటీ అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్.వార్డు సభ్యురాలు శ్రీలత


దుబ్బ గూడెం పునరావాస గ్రామానికి గతంలో అధికారులు ఇచ్చిన హామీ మేరకు అందరికీ న్యాయం చేయాలి. ఇళ్ల పరిహారం చెల్లించడంలో అవకతవకలు జరిగాయని కొంతమందికి తక్కువ డబ్బులు వచ్చాయి. గతంలో బోగ సీన్లకు పరిహారం చెల్లించమని అధికారులు హామీ ఇచ్చారు. మనుషులు నివసించే ఇండ్ల కంటే మనుషులు నివసించని బోగస్ ఇండ్లకే  ఎక్కువ వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై విచారణ జరిపి అందరికీ తగు న్యాయం చేయాలి.

    

Note:- దుబ్బ గూడెం  నిర్వాసితులపై ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు సామాజిక చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యేక కథనం ప్రసారం చేయడం జరుగుతుంది. వార్త కథనాన్ని వాట్సాప్ గ్రూపులో పెట్టడం జరగదు. కాబట్టి ' సామాజిక చైతన్య వేదిక కాసిపేట ' యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి చూడగలరని మండల వాసులకు విన్నపం.