మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓసిసి మాజీ అధ్యక్షుడు ఎస్ కే పాండే దంపతులకు ఘన సన్మానం

 ఓసిసి మాజీ అధ్యక్షుడు

ఎస్కే పాండే దంపతులకు

సన్మానం.

 జెడ్పి ఉన్నత పాఠశాలలో ఎస్కే పాండే దంపతులకు సన్మానం 


 జెడ్పి పాఠశాల విద్యార్థినిలతో ఎస్కే పాండే దంపతులు 

Scv News Kasipet:--

 కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ కర్మాగారం మాజీ అధ్యక్షుడు శివకుమార్ పాండే పదవి విరమణ సందర్భంగా ఈరోజు దేవాపూర్ జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో  పాండే దంపతులను పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా పూలదండలు శాలువాలతో  సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దామోదర్ అధ్యక్షత వహించారు.  సమావేశంలో సామాజిక చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు మేరుగు శంకర్ మాట్లాడుతూ ఎస్కే పాండే ఆధ్వర్యంలో దేవాపూర్, పరిసర ప్రాంత గిరిజన గూడాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని కొనియాడారు. ఆదివాసి గూడాలలో దేవాలయాల నిర్మాణం, పాఠశాలలో అదనపు గల నిర్మాణం, మరమ్మతులు ఫ్లోరింగ్ లాంటి పనులు చేయించాడన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ ఇప్పలగూడెంలో ధ్యాన మందిరాన్ని , గట్రావు పల్లె  గ్రామంలో అనాధ పిల్లలకు ఇల్లు నిర్మాణం లాంటి ఎన్నో పనులను ఎస్కే పాండే ఆధ్వర్యంలో చేసి గిరిజన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతాడని కొనియాడారు. ఆదివాసి నాయకుడు కురిసింగ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్కే పాండే గిరిజన గుడాల అభివృద్ధికి, దేవాపూర్ లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కృషి చేశాడన్నారు. ఈ సమావేశంలో ఆదివాసి నాయకుడు కురిసింగ హనుమంతు, పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.  తదనంతరం  పాఠశాల విద్యార్థుల నృత్యాలు అందరినీ అలరించాయి.