మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమం.

 ఘనంగా ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమం.


 మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమం.

Scv News Kasipet:--

మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ 105వ జయంతి కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాసిపేట మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఇందిరాగాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ, మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి ఉప సర్పంచ్ కనుకుల రాకేశ్ లు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ ఈ దేశానికి ఇందిరా గాంధీ గారు ఎనలేని సేవ చేసారని,వారి హయంలో  బ్యాంకుల జాతీయకరణ,రాజ భరణాల రద్దు చేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపారన్నారు.గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడం, మహిళలకు డ్వాక్రా సంఘాల ఏర్పాటు మొదలైన పథకాల ద్వారా దేశ ప్రజలకు స్వపరిపాలన అందించిన గొప్ప నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గోలేటి స్వామి,మైధం రమేష్ ,జాడి శివ,వెంకటేష్,ఎనగందుల వినోద్,చిలుముల శ్రీనివాస్, బానోత్ రవి తదితరులు పాల్గొన్నారు.