మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజి వర్ధంతి.

 కాసిపేట మండలం కేంద్రంలో

ప్రజాకవి కాలోజి  వర్ధంతి.

 కాళోజి చిత్రపటానికి పూలమాల వేస్తున్న తెలంగాణ జాగృతి మండల శాఖ అధ్యక్షుడు సురేష్.

Scv News Kasipeta:--

 కాసిపేట మండల కేంద్రంలో  తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో స్వరాష్ట్రకాంక్షను రగిలించిన ప్రజా కవి కాళోజి నారాయణరావు వర్ధంతిని ఈరోజు తెలంగాణ జాగృతి కాసిపేట  మండల శాఖ ఘనంగా నిర్వహించింది. కాళోజి చిత్రపటానికి  మండల శాఖ అధ్యక్షుడు సోదరి సురేష్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో మండల అధికార ప్రతినిధి గంగాధర్ రాజకుమార్, నాయకులు రత్నం రాజం, గడం లక్ష్మణ్, కిరణ్ కుమార్, చొప్పరి పవన్,ఏగ్గ సత్తి, కుమ్మరి తిరుపతి, పుట్ట అజయ్, నూనె సురేష్ లు పాల్గొన్నారు