మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట జూనియర్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 జూనియర్ కళాశాల, ఆదర్శ

పాఠశాలను సందర్శించిన 

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 కాసిపేట  జూనియర్ కాలేజ్ విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Scv News Kasipet:--

 కాసిపేట మండలం లోని జూనియర్ కళాశాలను ఆదర్శ పాఠశాలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈరోజు సందర్శించారు. మండల కోఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్ కూతురు వివాహానికి హాజరైన దుర్గం చిన్నయ్య తిరుగు ప్రయాణంలో మండల కేంద్రంలోని కాలేజీ ఆదర్శ పాఠశాల పాఠశాలను  సందర్శిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ జీవితంలో ఎదగాలంటే విద్య వల్లనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. అందరూ మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెంట  జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ స్కూల్ విక్రం రావు ముత్యం పెళ్లి ఉపసర్పంచ్ బోయిన తిరుపతి తదితరులు ఉన్నారు.