తెలంగాణ ఉద్యమకారుడు
సిరాజ్ ఖాన్ కూతురు
వివాహానికి వార్డు
సభ్యురాలు గోనెల శ్రీలత -
శ్రీనివాస్ లు పదివేల విరాళం
అందజేత .
![]() |
| సిరాజ్ ఖాన్ కుటుంబానికి పదివేల రూపాయల విరాళం అందజేసిన వార్డు సభ్యురాలు గోనెల శ్రీలత - శ్రీనివాస్ దంపతులు. |
Scv News Kasipeta:--
నేటి సమాజంలో చాలామంది నాయకులు ప్రజా ప్రతినిధులు అనైతిక పద్ధతిలో అడ్డమైన గడ్డి తిని అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ లక్షల రూపాయలను సంపాదించి వారి కుటుంబ అవసరాలకు మాత్రమే వినియోగించు కుంటున్నారు. తమ కళ్ల ముందు తోటివారు ఎన్నో ఆపదలలో ఉన్న ఒక్క రూపాయి కూడా వారికి సహాయం చేయకుండా గొప్పలు చెప్పుకుని మన కళ్ళ ముందు తిరిగే ఎందరో నాయకులను ప్రజాప్రతి నిధులను మనం నిత్యం చూస్తున్నాం. అలాంటి స్వార్థపరులను ప్రజలు ఈ సమాజం ఎప్పుడు గుర్తుపెట్టుకోదు. తాను సంపాదించుకున్న దాంట్లో కొంతైనా ప్రజల కోసం, సమాజం కోసం నీతి నిజాయితీగా పనిచేసిన వారి కుటుంబాల సహాయార్థం అందజేసి ఆదుకున్న వారిని ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారు. అలాంటి వారికి సమాజంలో ఎప్పుడు గౌరవం దక్కుతుంది. అలాంటి కోవకు చెందిన వారే కాసిపేట మండలం దుబ్బ గూడెం గ్రామానికి చెందిన గోనెల శ్రీనివాస్ - శ్రీలత దంపతులు. తమ కష్టార్జితంతో సంపాదించుకున్న కొంతైనా ఆపదలో ఉన్న పేద వర్గాలకు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మహనీయ మూర్తులు వారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి నిరుపేదగా మిగిలి కూతురు వివాహం కూడా చేయలేని దీనస్థితిలో ఉన్న సిరాజ్ ఖాన్ కు పెద్దమనసుతో పదివేల రూపాయల విరాళం అంద జేయడం వారి ఉదారతకు నిదర్శనం..
బుధవారం తెలంగాణ ఉద్యమకారుడు మండల కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్ కూతురు వివాహం కోసం పెద్ద మనసుతో కాసిపేట మండలం దుబ్బ గూడెం గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు గోనెల శ్రీలత -శ్రీనివాసులు తమ వంతు సహాయంగా మండల తెలంగాణ జేఏసీ కన్వీనర్ సిలోజు మురళి సమక్షంలో పదివేల రూపాయ లను బుధవారం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రస్తుతం తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రజా ఉద్యమాలలో పాల్గొంటున్న గోనెల శ్రీనివాస్ - వార్డు సభ్యురాలు శ్రీలత వ్యక్తిగతంగా పదివేల రూపాయలు విరాళాలు ఇవ్వడం గొప్ప విషయం. గతంలో శ్రీనివాస్ దంపతులు రొట్టె పెళ్లి గ్రామంలో కొమురం భీం విగ్రహం ఏర్పాటుకు 30 వేల రూపాయల భారీ విరాళం అందజేశారు. ఎంతో ఉదారతతో సిరాజుఖాన్ కూతురు వివాహానికి పదివేల రూపాయల విరాళం అందజేసిన ప్రజా ఉద్యమకారుడు గోనెల శ్రీనివాస్ - శ్రీలత దంపతులకు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.
