మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ముత్యం పల్లి వాసి కిషన్ కు దళితబంధు పథకం

దళిత బంధు లబ్ధిదారు కిషన్

 కు ఎమ్మెల్యే దుర్గం

చిన్నయ్య చే కారు పంపిణీ.

 దళిత బంధు లబ్ధిదారు కిషన్ కు కారు తాళాలు అందజేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Scv News kasipet :--

 కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన చొప్పదండి కిషన్ కి దళిత బంధు ధ్వారా మంజూరు అయినా కారు ను బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య చేతుల మీదుగా  ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దళితులకు దళిత బంధు ఇవ్వడం వలన వెనుకబడిన వారికీ చేయూతగా ఉన్నట్లు భావించి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమంను తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రారంభించి దళితులకు అండగా ఉంటున్నారన్నారు. ఇలాంటి పతకాలను ప్రవేశపెట్టడంతో  పేదలకు, వెనుకబడిన కులాలు, తెగలవారికి  ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుం టుందని కొనియాడారు. ఈ కార్య క్రమంలో జడ్పీటీసీ పల్లెచంద్రయ్య , వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు , సర్పంచ్ ఆడే బాదు,ఉపసర్పంచ్లు బోయిని తిరుపతి యాదవ్ , పిట్టల సుమన్ , మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య , కాసిపేట గ్రామ ప్రెసిడెంట్ అగ్గి సత్తయ్య , తదితరులు పాల్గొన్నారు.