మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

చిన్న ధర్మారం పంచాయతీలో బోర్ వెల్ ప్రారంభం.

చిన్న ధర్మారం లో 

బోర్వెల్ పనులు ప్రారంభం 

బోర్వెల్ పనులను ప్రారంభిస్తున్న సర్పంచ్ సునీత, వైస్ ఎంపీపీ విక్రం రావు.
S
cv News Kasipeta:--

 కాసిపేట మండలం చిన్న ధర్మారం పంచాయతీలో ఈరోజు పంచాయతీ సర్పంచ్ బుఖ్యా సునీత జకీర్ బోర్వెల్ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే దుర్గం చెన్నై ఆదేశాల మేరకు వైస్ ఎంపీపీ   విక్రం రావు మండల పరిషత్ నిధులనుండి బోర్ వెల్ కోసం రెండు లక్షల నిధులు మంజూరు చేయించారు. బోర్వెల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ విక్రం రావు, ముత్యం పల్లి  సర్పంచ్ ఆడే బాదు హాజరయ్యారు. కార్యక్రమంలో  ఉప సర్పంచ్ అశోక్, ముత్యంపల్లి ఉప సర్పంచ్ బోయిన తిరుపతి, వార్డు సభ్యులు సాల్మ, సందీప్, తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు మెరుగు శీను, ముత్యం పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు వేణు, అనిల్ రంజిత్ ఇమ్రాన్ ఇంతియాజ్ బర్ల రవి తదితరులు పాల్గొన్నారు.