కొండాపూర్ లో ఆదివాసి
పోరాటయోధుడు బిర్సా
ముండా జయంతి.
![]() |
| కొండాపూర్ గ్రామంలో తుడుం దెబ్బ ఆధ్వర్యం లో బిరుస్తాముండా జయంతి కార్యక్రమం. |
Scv news kasipeta :---
కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి కార్యక్రమం తుడుం దెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించారు. బిర్సా ముండా చిత్రపటాని కి కొండాపూర్ పెద్ద పటేల్ మడావి రాము,తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడావి వెంకటేశ్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మడావి వెంకటేష్ మాట్లాడుతూ జార్ఖండ్లో బిర్సా ముండా ఆదివాసుల హక్కుల సాధన కోసం బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడి చిన్న వయసులోనే అమరుడయ్యా డని గుర్తు చేశారు. తెలంగాణలో నైజాం వ్యతిరేకంగా ఆదివాసులకు జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీమ్ పోరాటం చేసి అమరుడయ్యాడని ఇద్దరి పోరాటం గిరిజనుల హక్కుల సాధన ధ్యేయంగా సాగిందన్నారు. గిరిజన పోరాటయోధుల పోరాట స్ఫూర్తిగా గిరిజన హక్కుల సాధన కోసం తుడుం దెబ్బ పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండలం పెంద్రం శంకర్, మండల సహాయ కార్యదర్శి కురిసింగ తిరుపతి, అత్రం మహేష్,మండల సలహదారు మడవి గంగారాం, అన్నపూర్ణ, కురిసింగ రమేష్ భగవంతురావు,జంగు, తదితరులు పాల్గొన్నారు.
