మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

భారత్ జోడోయాత్రలో కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులు.

రాహుల్ గాంధీ 'భారత్ 

జోడో ' యాత్రలో కాసిపేట

మండల కాంగ్రెస్ నాయకులు.

 రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులు.


 పాదయాత్రలో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు.


ScvNewsKasipeta:--

భారతదేశ సమైక్యతకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జూడో' పాదయాత్రలో మంచిర్యాల జిల్లా నుండి ఏఐసీసీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, సీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ప్రేమ్ సాగర్ రావు సురేఖ మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాల నుండి 100 బస్సులు ,  5000 ముఖ్య కార్యకర్తలతో ముఖ్య జిల్లా నాయకులు  కార్లలో 1000 మంది మొత్తం 6000 మందితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పెద్ద శంకరంపేట (అ) నారాయణఖేడ్ నియోజకవర్గం మెదక్ జిల్లా లో రాహుల్ గాంధీ చేస్తున్న దేశ వ్యాప్త పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన 3500 కిలోమీటర్ల భారత్ జోడో పాదయాత్రకు మద్దతు గా ప్రేమ్ సాగర్ రావు  ఆధ్వర్యంలో 375 మీటర్ల పొడవు గల  జాతీయ పతాకాన్ని తయారు చేసి రాహుల్ గాంధీ గారితో అడుగు లో అడుగు వేశారు. పాదయాత్రలో  కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ గారి నాయకత్వంలో ముఖ్య నాయకులు యంపిటిసిలు  పార్వతి మల్లేష్, మడె భీం రావు, మెరుగు పద్మశంకర్, నాయకులు గోలేటి స్వామి,కనక రాజు,మడావి వెంకటేష్,అన్నం కుమార్, మాజి సర్పంచ్ లుజాడి శంకర్,ప్రభాత్ రావు కూకట్ల  దేవెందర్, అనంతరావు,షాకీర్, ఖదీర్,జాడి శివ,గోపు శ్రీనివాస్,జంగిలి రమేష్, చిలుకయ్య, చారి,స్వాగతం పలికారు