మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఏసీపీ హామీతో టవర్ దిగిన టీచర్ శ్రీనివాస్.

 ఏసీపీ ఎడ్ల మహేష్  

హామీతో టవర్ దిగిన టీచర్

 శ్రీనివాస్.

ఆందోళన విరమించిన

ఉపాధ్యాయులు.

 ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఏసిపి ఎడ్ల మహేష్.


 టవర్ దిగి వచ్చిన పిఈటి శ్రీనివాస్ 

 టీచర్ శ్రీనివాసును అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న యాజమాన్యం.

Scv News Kasipet :--

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ కాలనీలోని డి ఏ వి పాఠశాల యాజమాన్యం వేతనాలు చెల్లించడం లేదని శనివారం ఉదయం నుండి రాత్రంతా చలిలో సుమారు 24 గంటలు టవర్ పై ఎక్కి ఆందోళనకు దిగిన టీచర్ శ్రీనివాస్ ఈరోజు ఏసిపి ఎడ్ల మహేష్ హామీ మేరకు టవర్ దిగి ఆందోళన విరమించారు. గత రెండు రోజులుగా ఉపాధ్యాయులు విద్యార్థుల ఆందోళనలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న దేవపూర్ లో ప్రశాంతత నెలకొంది.దేవాపూర్ ఓరియంట్ కాలనీలోని డి ఏవి స్కూల్ యాజమాన్యం వేతనాలు చెల్లించడం లేదని, వేధింపులకు గురి చేస్తుందని నిరసన వ్యక్తం చేస్తూ శనివారం ఉదయం పీఈటి శ్రీనివాస్ సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. అతనికి మద్దతుగా విద్యార్థులు కార్మికులు గ్రామ ప్రజలు ఓరియంట్ గేటు ముందు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారాలు చేసేందుకు పాఠశాల యాజమాన్యం, ఓరియంట్ యాజమాన్యం ముందుకు రాకపోవడంతో సమస్య పరిష్కరించే అంతవరకు టవర్ దిగే ప్రసక్తి లేదని టీచర్ శ్రీనివాస్ భీష్ముంచుకొని టవర్ పైనే ఉన్నాడు. అతనికి మద్దతుగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు టవర్ వద్ద ఓరియంట్ మెయిన్ గేట్ ముందు రాత్రంతా చలిలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కర్మాగారంలోని ఉత్పత్తి బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు బలవంతంగా ఆందోళనకు కూర్చున్న వారిని తొలగించి సిమెంటు లోడును తీసుకువెళ్లే లారీలను లోపలికి పంపించారు. ఆందోళన కారులు పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించారు.

ఈరోజు ఉదయం బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ సంఘటన స్థలానికి వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడారు. వారి సమస్యలను విని వాటిని పరిష్కరించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. గతంలో కార్మెల్ గిరి పాఠశాలలో ఉన్న విధంగానే డిఏవి పాఠశాలలో కూడా అదే వేతనాలు అవే హక్కులు ఉంటాయని హామీ ఇచ్చారు. రాబోయే రెండు మూడు రోజుల్లో పాఠశాల ఓరియంట్ యాజమాన్యంతో ఈ సమక్షంలోనే చర్చలు జరిపి మూడు నెలల వేతనం ఇప్పిస్తానని ఆందోళన విరమించాలని కోరడంతో ఉపాధ్యాయులు సమ్మతి ఇచ్చి ఆందోళన విరమించారు. టవర్ పై ఉన్న టీచర్ శ్రీనివాస్ కిందికి వచ్చాడు. చికిత్స నిమిత్తము అంబులెన్స్ లో మంచిర్యాల ఆసుపత్రులకు తరలించారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో దేవాపూర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.