భారతదేశ బహుజన బంధు
మహాత్మ జ్యోతిరావు పూలే.
- పల్లె మల్లయ్య సా చై వే అధ్యక్షుడు.
![]() |
| మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం |
![]() |
| జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలు చదువుతున్న చిత్రం |
Scv News Kasipet:--
భారతదేశంలోని బహుజన వర్గాల బంధువు మహాత్మ జ్యోతిరావు పూలే అని చదువుకుంటేనే జ్ఞానం వస్తుందని మొట్టమొదట పాఠశాలలు తెరిచిన మహనీయమూర్తి అని సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య కొనియాడారు. బుద్ధుడి తర్వాత 2000 సంవత్సరాలకు బహుజనుల హక్కుల కొరకు, స్త్రీలపై వివక్షకు వ్యతిరేకంగా దేశంలో పోరాటాలు ప్రారంభించి జీవితాంతం కొనసాగించిన సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు .ఈ రోజు మంచిర్యాలజిల్లా కాసిపేట మండలం మలకపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్య క్రమంలోవిద్యార్థులకు జ్యోతిరావు పూలే జీవిత విశేషాలను వివరించారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ భారతదేశంలోని బహుజనులకు, స్త్రీలకు మొట్ట మొదటి సారి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా బోధన చేసిన మహనీ యుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. భారత దేశంలో 1818 కి ముందు బ్రాహ్మణు లకు మాత్రమే చదువుకునే అవకాశం ఉందని బహుజనులకు విద్యాబోధన లేదని అన్నారు. బహుజనులు చదువు కుంటే నాలుకలు కోసి చెవులలో సీసం పోసేవరని అన్నారు. బీమా కోరేగాం యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య వాదం భారతదేశంలో సుస్థిరపడి బహుజనుల కోసం పాఠశాలలు ప్రారంభించిందని విద్యార్థులకు గుర్తు చేశారు. జ్యోతిరావు పూలేను పాఠశాలలో విద్యాబోధన పంపిస్తే మాలి కులస్తులు చదువుకుంటే దేవుడికి ఆగ్రహం వస్తుందని అతని తండ్రి గోవిందరావును బెదిరించడంతో మూడుసార్లు పాఠశాల మాన్పించరాని విద్యార్థులకు వివరించారు.
జన్నారం గిరిజన ఆశ్రమ పాఠశాలల ఎస్ఆర్టి రఘునాథ్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరపడం అభినందనీయం అన్నారు.
ప్రధానోపాధ్యాయుడు వేములవాడ రమేష్ మాట్లాడుతూ లు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే భారతదేశం లోని బహుజన వర్గాలకు చేసిన సేవలు వెలకట్టలేనివి అన్నారు. పాఠశాలలు తెరిచి విద్య బోధన చేయడం వల్లనే నేడు బహుజను లంతా చైతన్యవంతము అయ్యారని కొనియాడారు.
సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహాదారు మద్దినేని చిన భీమయ్య మాట్లాడుతూ విద్యార్థులు మహాత్మ జ్యోతిరావు పూలే జీవితాన్ని ఆదర్శం గా తీసుకుని మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, సమాజానికి పేరు తేవాలని విద్యార్థులను కోరారు. మహాత్మా పూలే సావిత్రిబాయి దంపతులు బ్రాహ్మణ వర్గాలు శూద్ర, అతిశూద్రులకు చదువులు నేర్పవద్దని ఆంక్షలు విధించిన ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొని పాఠశాలలు నడిపిన మహనీయ మూర్తులని కొనియాడారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ విద్య లేకపోవడం వల్లే బహుజన వర్గాలు జ్ఞానం లేకుండా పోయిందని మహాత్మ జ్యోతిరావు పూలే మహనీయుడు గుర్తించాడు అన్నారు. మనువాద బ్రాహ్మణి వర్గం బహుజనులకు విద్య బోధన చెప్పవద్దని నిన్ను ఆంక్షలు దాడులు చేసిన వినకుండా పాఠశాల నడిపిన సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని విద్యార్థులకు వివరించారు. బహుజన జాతి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను ఈ సమాజం గుర్తుంచుకోవాలని విద్యార్థులను కోరారు. వారి జయంతి, వర్ధంతులను ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వారి త్యాగాలను గుర్తుకు చేసుకోవాలని కోరారు.
ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఎస్ ఆర్ టి లు రఘునాథ్, చందు, వార్డెన్ భీమయ్య, ఉపాధ్యాయుడు చంద్రమౌళి, బద్ది శ్రీనివాస్ సామాజిక చైతన్య వేదిక నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అధ్యక్షతన సమావేశం జరిగింది.






