మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

నేడు ప్రజా నాయకుడు రఘుపతి రావు పదవ వర్ధంతి.

 అసలు సిసలైన

ప్రజానాయకుడు, పేద వర్గాల

పెన్నిధి రఘుపతి రావు

దొరను గుర్తుచేసుకుందాం..

 అసలు సిసలైన ప్రజానాయకుడు రఘుపతిరావు.

 మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపీపీ రఘుపతి రావు.

 కొండాపూర్ లో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న రఘుపతి రావు.


Scv News Kasipeta:--


నేటి సమాజంలో  ప్రజల కోసం  నిస్వార్థంగా నిజాయితీగా అహర్నిశలు కృషి  చేసిన నాయకులను  ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకుంటారు. వారు చేసిన సేవలు,త్యాగాలు చిరస్మరణీ యంగా ఉంటాయి. కాసిపేట మండలం లో నాలుగు దశాబ్దాలుగా  ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం తన జీవితాం తం కృషిచేసిన మహానీయమూర్తి రఘుపతి రావు. అహంకారం, అహంభావానికి ప్రతి రూపాలైన వెలమ దొరల కుటుంబంలో పుట్టినా, 'దొర' అనే  అహంకారం లేకుండా ప్రజలందరి తో కలసిపోయి ఎప్పుడు  చిరునవ్వుల తో అందరినీ ఆప్యాయంగా పలకరిం చే మానవతావాది రఘుపతిరావు. మండలంలోని గ్రామాలను నిరంతరం కలియ తిరుగుతూ ప్రజాసమస్యలను  పరిష్కరించిన ప్రజా నాయకుడు రఘుపతిరావు.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా, ఎంపీపీగా ఐదేళ్ళ పదవీ కాలంలో  'నా భూతో, నా భవిష్యత్తు 'అనే రీతిలో మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపాడు. మండల సమస్యలపై  ప్రజలను ఇబ్బందుల పాలు చేసే తాగునీటి సమస్య, ఓపెన్ కాస్ట్ వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ ఉద్యమంలో  క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజలతో ఉద్యమించిన ఉద్యమ నాయకుడు రఘుపతి రావు. నిఖార్సైన ప్రజా సేవకుడిగా నేటి యువతరానికి, ప్రజాప్రతి నిధులకు ఎల్లవేళలా  స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు. మండల ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడు అనారోగ్యంతో అకాల మరణం చెంది నేటికి పది వసంతాలు గడుస్తున్న సందర్భంగా  రఘుపతి రావు సేవలను   గుర్తు చేసు కుంటూ  Scv News అందిస్తున్న  ప్రత్యేక కథనం...

తెలంగాణలో దొరతనం అంటేనే పీడిత ప్రజలపై వారు సాగించిన అరాచకాలు, దోపిడీ దౌర్జన్యాలు గుర్తుకు వస్తుం టాయి. వెలమ దొరలు, రెడ్లు నైజాం నవాబుల వద్ద గులాములుగా (బానిసలు గా ) ఉంటూ వారు ఇచ్చిన అధికార బలంతో గ్రామాలలో పెత్తనం చెలాయించే వారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన బహుజనులను తమ గులాములుగా  (బానిసలుగా) చేసుకొని వారిని నానా రకాలుగా  హింసించి, భూమిశిస్తు ఇతర పన్నులను వసూలు చేసి పైకాన్ని నైజాం ప్రభువుకు కట్టి గ్రామాలపై పెత్తనం చెలాయించే వారు.దొరల ఇళ్ళలో జరిగే శుభకార్యాలు, పండుగలకు ఎలాంటి ప్రతిఫలాన్నీ ఇవ్వ కుండానే బహుజనులతో వెట్టి చాకిరి చేయించుకునేవారు. తాము ఏదైనా గ్రామాలలో ప్రయాణించాలంటే తమ సవారి కచ్చరం (ఎడ్లబండి )ముందు,వెనక  చాకలి, మంగలి వాళ్ళు రక్తాలు కక్కుతూ పరిగెత్తించే వారు. దొరల  ఇళ్ల ముందు నుండి  చెప్పులు వేసుకుని వెళ్లడం కూడా నేరంగా భావించేవారు. ఇలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేసే కొంతమంది దొరలు తెలంగాణ జిల్లాలోనే కాకుండా కాసిపేట మండలంలో కూడా ఉండేవారు. ప్రజలపై వీరు సాగిస్తున్న అరాచకాలు, దోపిడి దౌర్జన్యాలు నాటి  తెలంగాణ సాయుధ పోరాట యోధులు కమ్యూనిస్టు గెరిల్లాల దృష్టికి వెళ్లడంతో  ప్రజాకంఠకుడిగా  మారిన ఒక దొరను పట్టపగలు నడిరోడ్డుపై  హతమార్చడంతో మండలంలో వారి అరాచక పాలన అంతమైంది...

కానీ..పెత్తందారీ, అహంకార  స్వభావం గల  వెలమ దొరలలో కూడా ప్రజల కోసం పరితపిస్తూ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడిన ప్రజా నాయకులు కూడా  ఉన్నారు. ఆ కోవకు చెందిన వెలమ దొరే ధర్మారావు పేట గ్రామానికి చెందిన  కొక్కిరాల రఘుపతిరావు. పుట్టింది వెలమ దొరల కుటుంబంలోనే అయినా పెద్దగా భూములు లేక పేదరికంలోనే ఉండేవాడు. రఘుపతి రావు తండ్రి కృష్ణారావు వందలాది ఎకరాలు ఉన్న జాగీర్దార్ గా ఉన్న కాసిపేట  వెలమ దొరల వద్ద  వారి భూములను సాగు చేసే సారేదార్ గా పని చేశాడు. రఘుపతి రావు 1975- 80  ప్రాంతంలో ధర్మారావు పేట గ్రామంలో  గడ్డి గుడిసెలోనే జీవితాన్ని ప్రారంభించి సారా కాంట్రాక్టర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే వారు. అతనికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొండాపూర్ సమీపంలో  క్రషర్ పెట్టి నష్టాలు రావడంతో పెద్ద కుమారుడు ప్రేమ్ సాగర్ రావు  (మాజీ ఎమ్మెల్సీ)  గ్రామాన్ని విడిచి 1982లో హైదరాబాద్ కు  వెళ్ళాడు. అక్కడ  రియల్ ఎస్టేట్ రంగంలో స్థిర పడడంతో  రఘుపతి రావు కుటుంబం ఆర్థికంగా బలపడింది. తాను సంపాదించిన దాంట్లో కొంత ప్రజాసేవకు ఖర్చు చేయడం ప్రారంభించారు. ధర్మారావు పేట  గ్రామంలో సుమారు 20 లక్షల వ్యయంతో కోదండ రామాలయా న్ని, కొండాపూర్ యాప వద్ద పెద్ద  తోరణాన్ని( కమాన్ )నిర్మించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం, పేదలకు వివాహాలు జరిపిస్తున్నా రు. 2001లో ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో పిసిసి సభ్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రేమ్ సాగర్ రావు ఆర్థిక అండతో  రఘుపతి రావు పూర్తి సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి  మండలం లోని గ్రామాల అభివృద్ధికి, ప్రజాసేవకే అంకితం అయి పని చేశారు .

రాజకీయాలలో నైతిక విలువలకు,

నీతి నిజాయితీ కి మారుపేరు

రఘుపతిరావు.


మండల రాజకీయాలలో చాలామంది నాయకులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ లోకి మారుతూ  రాజకీయ ఆధిపత్యం చెలాయించే వారు. ప్రజల వద్ద ప్రతి పనికి లంచాలు తీసుకుంటూ తమ స్వార్ధ ప్రయోజనాలకు ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసి రాజకీయాలు నడిపిన వారు ఉన్నారు. రఘుపతి రావు మాత్రం తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో  అధికారం ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు . ప్రజలకు నిస్వార్ధంగా నిజాయితీగా నైతిక విలువలకు ప్రాధాన్యత నిచ్చి  పని చేసిన నికార్సైన నాయకుడు రఘుపతి రావు. మండలంలో గత 40 ఏళ్లుగా రఘుపతి రావు ధర్మారావుపేట సింగిల్విండో చైర్మన్ గా, దేవపూర్ ఓరియంట్ కార్మిక సంఘం గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా వివిధ హోదాలలో ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రజా సమస్యలను ఎన్నో తీర్చాడు. 

రఘుపతి రావు  మండలంలో చేసిన సేవా కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి...

కాసిపేట,ముత్యం పల్లికి తాగునీటి సరఫరా.

 సింగరేణి యాజమాన్యం  1996లో కాసిపేట భూగర్భ గని తవ్వకాల వల్ల కాసిపేట, ముత్యం పెళ్లి గ్రామాలలోని వందలాది  మంచినీటి బావుల ఏండి పోయాయి. రెండు గ్రామాల ప్రజలు వేసవి కాలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాగునీటి కోసం ఆందోళనలకు దిగారు. తాగునీటికి తల్లడిల్లు తున్న రెండు గ్రామాల ప్రజలకు ప్రేమ్ సాగర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వార వేసవి కాలంలో రెండు గ్రామాలలో వెయ్యి లీటర్ల సింథటిక్  ట్యాంకులు ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసి వారి దాహార్తిని తీర్చిన మానవతావాది రఘుపతి రావు.

 మండలంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.

 కుర్ర గడ్ కాలనీలో ఇందిరమ్మ 
కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోమండలంలోని అన్ని గ్రామాలలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడం లో రఘుపతిరావు ది క్రియాశీల పాత్ర. తన వాహనంలో గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లను వెంటపెట్టుకుని ప్రతి గ్రామాన్ని సందర్శించి రాజకీయాల కతీతంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పించిన ఘనత ఆయనదే. మండలంలో  ఇందిరమ్మ పథకంలో  మూడు విడతల్లో  నాలుగువేల పేదలకు ప్రతి ఒక్కరికి గృహాలు మంజూరు చేయించారు. ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు, వారి బిల్లు చెల్లించే వరకు అధికారులను విడిచి పెట్టే వారు కాదు.

 పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు, కాలనీల ఏర్పాటు.

 సోమగూడెం పాతబస్తీ పునరావాస కాలనీ.

మండలంలోని వివిధ  గ్రామాలలో పేదవారికి ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసి,కాలనీలు ఏర్పాటు చేసిన ఘనత రఘుపతి రావు దే. ముత్యం పల్లి, కోనూరు, సోనాపూర్ నాయక పుగూడెం, దేవాపూర్ నాయకపు గూడెం, కొత్త తిరుమలాపూర్, సోమగూడెం పునరావాస కాలనీ లలో ప్రభుత్వ నిధులతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి కాలనీలను ఏర్పాటు చేసిన  పేద వర్గాల పెన్నిధి రఘుపతి రావు.

ముత్యం పల్లి లోని  ఆట స్థలం ఆయన కృషి.

 ముత్యం పల్లి లోని క్రీడామైదానం 

జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్న మండలంలోని ముత్యంపెళ్లి గ్రామంలోని  ప్రధాన ఆట మైదానం  రఘుపతి రావు ప్రత్యేక కృషి తోటే ఏర్పాటయింది. ముత్యం పెళ్లి కాసిపేట గ్రామాల్లోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఎనిమిది ఎకరాల భూమి ని స్థానిక వెలమ దొరల వద్ద ప్రభుత్వ నిధులతో భూమిని కొనుగోలు చేశాడు. పేదలకు ప్లాట్లు ఏర్పాటుచేసి పంపిణీ కూడా చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీ ఎస్సీ లకు  ఇండ్ల స్థలాలు  ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో  ఆ ఫలాన్ని క్రీడా మైదానం కు కేటాయించడం జరిగింది. రఘుపతి రావు పేద వర్గాల పై ఉన్న మక్కువతో ఆ రోజు స్థలం కొనుగోలు చేయకుంటే నేటి క్రీడా మైదానం ఉండేది కాదు.

సోమగూడెం పునరావాస కాలనీ ఆయన చలువే.


సోమగూడెం పాతబస్తీ సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ కోసం గని ని మూసి వేయడం జరిగింది. పాతబస్తీలో అప్పటికి 150 కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. సింగరాయ జమాన్యం కాలనీకి తాగునీరు విద్యుత్ ను తొలగించి ఇబ్బందులకు గురిచేసేది. పాతబస్తీ కాలనీ ప్రజలకు శాశ్వత నివాసాలు ఏర్పాటు కోసం జాతీయ రహదారికి సమీపంలో ఎంపీపీ గా ఉన్న రఘుపతిరావు ప్రత్యేక శ్రద్ధతో జిల్లా కలెక్టర్ తో మాట్లాడి 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసి కాలనీలు ఏర్పాటు చేశారు. కోనూరు పంచాయతీ కార్యాలయం సమీపంలోని కొత్త కాలనీ, దేవాపూర్ నాయకత్వం కూడా సమీపంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం లో స్థలం, క్రీడామైదానం స్థలం రఘుపతి రావు హాయంలో  కొనుగోలు చేసిన ఇంటి  స్థలాలే.

అనారోగ్యంలో కూడా మండల అధికారులతో సమావేశాలు.

 ధర్మారావు పేట గ్రామంలో అనారోగ్య సమయంలో మండల అధికారులతో సమావేశం.

 మండల సర్వసభ్య సమావేశం లో 

తాను ఎంపీపీగా పనిచేసిన రోజులో ప్రతిరోజు కార్యాలయానికి హాజరై అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చిస్తూ అధికారులను వెంటపెట్టుకుని  ఏదో ఒక గ్రామానికి వెళ్లి  ప్రజాసమస్యలు తెలుసుకునే వాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ కార్యాలయానికి  వెళ్లలేని పరిస్థితిలో కూడా ధర్మారావు పేట ఇంటివద్ద అధికారులతో సమావే శాలు ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిరంతరం ప్రజల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం తాను పడే తాపత్రయానికి ప్రత్యేక నిదర్శనం. అలాంటి  మహా నాయకుడు మండల  ప్రజలకు మళ్లీ దొరకడం అత్యాశ అవుతుంది. 

- 2-

( కాసిపేట ఓపన్ కాస్ట్ వ్యతిరేక  ,తెలంగాణ ఉద్యమంలో రఘుపతి రావు క్రియాశీలక పాత్ర గురించి...)