మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మందమర్రి ఏరియా కాసిపేట-2 గనిలో రక్షణ పక్షోత్సవాలు.

 రక్షణతో కూడిన ఉత్పత్తి

సింగరేణి లక్ష్యం.

-  వెంకటేశ్వర్లు రక్షణ

పక్షోత్సవాల టీం కన్వీనర్

 కాసిపేట -2  రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మాట్లాడుతున్న
 రక్షణ టీం కన్వీనర్ వెంకటేశ్వర్లు.

 మాట్లాడుతున్న జిఎం చింతల శ్రీనివాస్.

 రక్షణ పోటీలో గెలుపొందిన కార్మికుడికి  బహుమతి అందజేస్తున్న రక్షణ టీం కన్వీనర్ వెంకటేశ్వర్లు .

 గుస్సాడి నృత్యాలతో  రక్షణ టీంకు  స్వాగతం పలుకుతున్న గాని అధికారులు 


Scv News Kasipeta:--

 సింగరేణిలో రక్షణ తో కూడిన ఉత్పత్తి లక్ష్యంగా గనులలో పనులు నిర్వహించ డం జరుగు తుందని రక్షణ పక్షోత్సవాల టీం కన్వీనర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మందమరి ఏరియా కాసిపేట -2 రక్షణ పక్షోత్సవాలను పర్యవేక్షించేం దుకు రక్షణ టీంతో హాజరై గని ఆవరణంలో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్మికులు గనిలో పనులు ప్రారంభించే ముందు తాము చేస్తున్న పని పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సింగరేణి లోని గనులలో ప్రమాదాల నివారణ కోసం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు. దీనికోసం సింగరేణి ఉన్నతాధికారులు కొందర్ని ఆస్ట్రేలియా వెళ్లి శిక్షణ ఇప్పించ డం జరిగిందని గుర్తు చేశారు.అప్పటి నుండి రక్షణ విషయమై కార్మికులకు అవగాహన కల్పించడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు. మందమరి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతు గనులలో రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయడం వల్ల గనులలో చేపట్టే పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. కార్మికులు కూడా పనులు చేపట్టే ముందు రక్షణ పరికరాలు చేబట్టి చేయడం వల్ల ప్రమాదాలను అరికట్ట వచ్చని సూచించారు. కేంద్ర గుర్తింపు కార్మిక సంఘం ఏరియా కార్యదర్శి మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ కాసిపేట2 గనిలో 98 శాతం యువ కార్మికులే ఉన్నారని సీనియర్ కార్మికులు చెప్పే రక్షణ సూత్రాలు పాటించి ఉత్పత్తి చేయాలని అన్నారు. బెల్లంపల్లి బ్రాంచ్ఎ ఐ టిసియు కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ సింగరేణి  ప్రమాద రహిత గనులుగా తిర్చి  దిద్దడమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను  పరిశీలించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చూడడమే రక్షణ పక్షోత్సవాల ఉద్దేశం ఉన్నారు. సమావేశానికి ముందు గని మేనేజర్ రవీందర్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి ఏటా జరిగే పండుగ లలో ఇండ్లను ఎలా ముస్తాబు చేస్తామో రక్షణ పక్షోత్సవాల సందర్భంగా గనుల ను కూడా అలాగే సుందరంగా తీర్చి దిద్దడం జరుగుతుందన్నారు.కార్య క్రమానికి ముందుగా రక్షణ టీం సభ్యుల ను కానీ అధికారులు గిరిజన సాంప్రదాయ పద్ధతులైన డప్పులు గుస్సాడి నృత్యాలతో ఊరేగింపుగా సమావేశ మందిరం వద్దకు తీసుకు వెళ్లారు. సమావేశం అనంతరం గనిలో రక్షణ పోటీల్లో బహుమతులు గెలుచుకున్న  కార్మికులకు రక్షణ టీం ద్వారా బహుమతులను అందజేశారు. తదనంతరం ప్రమాదాల నివారణకై మందమర్రి ఏరియా కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో నాకు సెలవు ప్రదర్శిం చడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసి పేట గ్రూప్ ఏజెంటు కుర్మా రాజేందర్, రక్షణాధికారి సంతోష్ రావు, అండర్ మేనేజర్ నాగేశ్వరరావు  ఏరియా లోని వివిధ అధికారులు పాల్గొన్నారు.