భారతదేశంలో మహా
విప్లవం బౌద్ధం.
'బౌద్ధానికి, బ్రాహ్మణిజాన్ని కి జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర ' అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్.
Scv News Kasipet:--
భారత దేశంలో నేడు కొనసాగుతున్న హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలు మూడు విదేశీ మతాలే. దేశంలోని మూలవాసులైన బహజనుల మతం బౌద్ధం అనే సంగతి నేటికీ చాలా మందికి తెలియదు. బౌద్ధం మతం కాదు ధర్మం. మతం అంటే మారనిది. బౌద్ధ ధర్మం ఆకాలికం అన్ని కాలాలకు వర్తించే శాస్త్రీయమైన ధర్మం. సమాజం లోని ప్రజలలో నెలకొన్న అన్ని రుగ్మతలకు పరిష్కారం చూపేది బౌద్ధ ధర్మం. ఈ దేశ ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపి విశేషంగా ఆకర్షించిన శాస్త్రీయమైన బౌద్ధ ధర్మాన్ని బ్రాహ్మణ మనువాద వర్గం కుట్రపూరి తంగా దేశం నుండి తరిమి వేశారు. బౌద్ధాన్ని తమ దేశాలకు ఆహ్వానించి బౌద్ధ ధర్మం పాటిస్తున్న జపాన్, చైనా, కొరియా లాంటి దేశాలు ప్రపంచంలో అభివృద్ధి పథంలో నేడు పురోగ మిస్తున్నాయి. భారతదేశం బౌద్ధ సామ్రాట్ అశోకుడి పాలనాలో అభివృద్ధిలో జి.డి.పి 34 తో ప్రపంచంలోనే ధనవంత దేశంగా ఉండేది. నేడు హిందూ ధర్మాన్ని పాటిస్తున్న భారత దేశం మాత్రం జిడిపి 6, 7 తో తిరో గమనిస్తూ పేద దేశంగా విలసిల్లుతున్నది. దేశంలో శతాబ్దం పాటు విలసిల్లిన బౌద్ధ మహా విప్లవం గురించి నేటి తరానికి వివరించే ప్రయత్నం చేస్తున్నాము....
భారతదేశంలో బుద్ధుడు రాకముందు ఉన్న పరిస్థితిలు ఇలా ఉన్నాయి.
భారతదేశంలో సింధు నాగరికత ధ్వంసం అయిన తర్వాత క్రీస్తుపూర్వం 1500 నుండి ఆర్యుల పాలన కొనసాగింది. బుద్ధుడి కాలం నాటికి మూడు వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ఉన్నాయి. వీటి ఆధారం బ్రాహ్మణుల వైదికమతం నడిచింది . బుగ్వేదంలోని పురుషసూక్తం ప్రకారం అప్పటి సమాజంలోని మనుషులను నాలుగు వర్ణాలుగా విభజించి వారి చేతిలో ఓడిపోయిన స్థానిక ద్రవిడ జాతి ప్రజలను శూద్రులుగా తమ మూడు వర్ణాల సేవలు చేసుకునే సేవకులుగా వాడుకున్నారు. వారికి ఎలాంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, హక్కులు లేకుండా బానిసలాగా చూశారు. బ్రాహ్మణ వర్గం తమ స్వార్థం కోసం తమ కడుపు నింపుకునేఅందుకు రాజులు తమ రాజ్యం స్థిరంగా ఉండాలంటే యజ్ఞ, యాగాల చేయాలని ప్రోత్సహించే వారు. యజ్ఞాల పేరిట వేలాది పశువులను చంపడం, టన్నులకొద్దీ విలువైన నెయ్యిని అగ్నికి ఆహుతి చేయడం, కర్మకాండల పేరిట బ్రాహ్మణుల దోపిడీ విపరీతంగా ఉండేది. ఒక యజ్ఞం చేయాలంటే సుమారు మూడు వేల నుండి నాలుగు వేల పశువులను యజ్ఞగుండంలో బలి ఇచ్చేవారు. యజ్ఞగుండంలో పశువులను బలిచ్చేందుకు పెద్దపెద్ద దుంగలు వాడేవారు. దుంగలకు పెద్ద పెద్ద చెట్లను వాడేవారు. అప్పుడప్పుడే సమాజం వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండేది. ఆవులు, ఎద్దులు వ్యవసాయానికి ఎంతో ఉపయోగ పడేవి. పశుసంపదను యజ్ఞాలలో బలివ్వడం అప్పటి సమాజంపై తీవ్ర ప్రభావం చూపింది. సమాజంలో బ్రాహ్మణుల దోపిడీ,యజ్ఞ యాగాలను, కర్మకాండలు పెచ్చరిల్లి ప్రజలను, రాజులను కూడా తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. సమాజంలోని అంధ విశ్వాసాలు మూఢనమ్మకాల నుండి పారద్రోలి దుఃఖ నివారణ కోసం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో క్షత్రియ రాజు అయిన బుద్ధుడు రాజ్యాన్ని త్యాగం చేసి సన్యాసం తీసుకొని ధర్మ ప్రచారానికి నడుము కట్టారు.
బుద్ధుడు బోధనలతో సమాజంలో మార్పు..
బుద్ధుడు బోధించిన ధర్మ వల్ల సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ప్రపంచంలో దుఃఖ ముందని దుఃఖ నివారణకు అష్టాంగ మార్గమే శరణ్యమని 4 ఆర్య సూత్రాలను ప్రపంచానికి తెలిపాడు. మనుషులు నైతిక విలువలతో జీవించేందుకు జీవ హింస, దొంగతనం,అబద్ధాలు, వ్యభిచారం, మద్యపానం చేయవద్దని పంచశీలను బోధించాడు. బుద్ధుడు తన అనుచర భిక్షువులతో తన బోధనలు బుద్ధం, ధర్మం, సంఘం త్రీ చరణాలతో పాటు నాలుగు ఆర్య సత్యాలు, అష్టాంగమార్గం పంచశీల, దశ పార మితులతో ధర్మ ప్రచారం చేయడం నాటి సమాజంపై తీవ్ర ప్రభావం చూపింది. బహుజన హితాయ, బహుజన సుఖయా లోఖాను కంపాయా ను బౌద్ధ ధర్మం లక్ష్యంగా చేసుకుని బహుజనుల కోసం ధర్మ ప్రచారం చేపట్టారు. బుద్ధుడి బోధనలు, బౌద్ధ ధర్మానికి ప్రజలతో పాటు రాజులు కూడా ఆకర్షితుల య్యారు. నాటి సమాజంలో యజ్ఞ యాగాలు,జీవహింస,బ్రాహ్మణ దోపిడి తగ్గిపోయింది.
బౌద్ధ ధర్మం శాస్త్రీయం.
బుద్ధుడు బోధించిన ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గము పంచశీల, దశ పారామితులతో కూడిన బౌద్ధ ధర్మం శాస్త్రీయమైనది. దేవుడు దయ్యం లాంటి అంద విశ్వాసాలు, మూఢ నమ్మకాలకు తావులేదు. కుల మతాలు లేవు, ప్రజలంతా సమానమేనని సమతను బోధించాడు, ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుందని రుజువులు లేకుండా దేన్నీ నమ్మవద్దని కార్య కారణ సిద్ధాంతం ప్రచారం చేశాడు . ఆత్మ,దేవుడు లేడని మనుషులను నడిపించేది ఆత్మ కాదని మనసు మాత్రమే నని ప్రచారం చేశాడు. అనాత్మ వాదం, నిరీశ్వర వాదంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. అప్పటివరకు బ్రాహ్మణుల వైదిక మతం ఈ రెండిటి మీద ఆధారపడి బ్రతికేది. బౌద్ధ బోధనల పట్ల ప్రజలు విశేషంగా ఆకర్షితులు కావడం, ప్రజల స్పందనను చూసి రాజులు కూడా బౌద్ధాన్ని స్వీకరించడంతో బౌద్ధం ధర్మం చేతిలో వైదిక మతం చావుదెబ్బ తిని ఆదరణ కోల్పోయింది.
అశోకుడు బౌద్ధ స్వీకరణ తో విరివిగా ప్రచారం.
బుద్ధుడి తదనంతరం బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసే బౌద్ధ భిక్షువులు జీవ హింస చేయవద్దని యుద్ధాలు చేయవద్దని దేశంలో విస్తృతంగా ప్రచారం చేశారు. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి సామ్రాట్ అశోకను కళింగుల తో యుద్ధం చేయవద్దని బౌద్ధ భిక్షువులు వేడుకున్నారు.కళింగ యుద్ధం లో లక్షలాది మంది సైనికులు చనిపోయి రక్తం ఏరులై పారడం చూసి చలించి అశోకుడు యుద్ధాలకు స్వస్తి పలికి బౌద్ధాన్ని స్వీకరించారు. దేశంలో అప్పటివరకు అంతంత మాత్రంగా ఉన్న బౌద్ధ ప్రచారం సామ్రాట్ అశోక బౌద్ధం స్వీకరించడంతో ఆదరణ పెరిగిపోయింది. దేశంలో యుద్ధాలను, జీవహింస, జంతువుల వేటను సాధిం చాడు.బౌద్ధ ధర్మానికి ఆకర్షితుడైన అశోకుడు ఇతర దేశాలకు కూడా బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయాలని బౌద్ధ భిక్షువుల ను గురువులను ఇతర దేశాలకు పంపించాడు. తన కుమార్తె సంఘమిత్ర ను కొడుకు మహేంద్రను వీళ్లంతా పంపించారు. బుద్ధుడు ప్రవచించిన 84వేల ధర్మ ప్రవచనాలను శిలా శాసనాలు గా మార్చి భారతదేశం మంతటికీ పంపించారు. సారనాథ్ లో నేటి జాతీయ జెండా లోని అశోకుని ధర్మచక్రం భారత జాతీయ సార్వభౌమత్వానికి సూచిక అశోకుని సింహాల స్థూపాలను సారనాథ్ లో స్థాపించాడు. యుద్ధాలు నిలిచిపోవడంతో దేశం అభివృద్ధి పథంలో కి వెళ్లింది.
బౌద్ధ రాజుల పాలనలో విద్య వైజ్ఞానిక రంగంలో అభివృద్ధి.
భారతదేశం లో బౌద్ధ రాజుల కాలంలో నలందా,తక్షశిల, విక్రమ కపూరి లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయాలు నెలకొన్నాయి. వేలాది మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువు అభ్యసించారు. వైద్య శాస్త్రంలో అగ్రగణ్యుడైన జీవకుడు, చరకుడు సుశ్రుతుడు, వాగ్భటుడు, ప్రపంచానికి గణితశాస్త్రంలో సున్నా ను పరిచయం చేసిన ఆర్యభట్ట ఇలాంటి వారందరూ బౌద్ధ భిక్షువులు కావడం విశేషం.
బ్రాహ్మణుల కుట్రతో పతనమైన బౌద్ధ రాజ్యం.
భారతదేశంలో అశోకుడు బౌద్ధ స్వీకరణ అనంతరం క్రీస్తు పూర్వం 268 నుండి అతని మునిమనుమడు బృహద్రథుడు క్రీస్తు పూర్వం 185 వరకు 83 సంవత్స రాలు దేశం బౌద్ధ రాజ్యపరిపాలన లోనే ఉండేది.దేశంలో బ్రాహ్మణ మతమైన వైదికమతం ఆదరణ కోల్పోయిన బిక్కుబిక్కుమంటూ బ్రతికింది. బౌద్ధ రాజులు బౌద్ధ మతానికి ఇచ్చిన ఆదరణ మిగతా మతాల జైనా, వైదిక మతాలకు, పూజారులు కూడా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి బృహద్రథుడుని అతడి సర్వ సైన్యాధ్యక్షుడు అయిన బ్రాహ్మణుడు పుష్యమిత్ర సుంగుడు క్రీస్తుపూర్వం 185 లో కుట్రపూరితంగా హత్యచేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించు కున్నాడు. దీంతో బౌద్ధ రాజ్యం పతనమైంది.
పుష్యమిత్ర సుంగ పాలనతో బ్రాహ్మణ మతం విజృంభన.
దేశంలో పుష్యమిత్ర శుంగుడు పాలనలో ప్రతి ఘాతక విప్లవం ప్రారంభమైంది. బ్రాహ్మణ వైదిక మతం విజృంభించి ఈ దేశ మూలవాసులైనా బహుజనులపై ఉక్కుపాదం మోపింది . పుష్యమిత్ర శుంగుడు దేశంలోని బహుజనులకు విద్యను నిషేధించాడు, బౌద్ధ ఆరామాలను కూల్చి వేయించాడు.బౌద్ధ ధర్మాన్ని బోధించే భిక్షువులను ఉచకోత కోయించాడు. భిక్షువుల తలలు నరికి తెచ్చిన వారికి బహుమతులు ప్రకటించారు.నాటి సమాజంలో ఉన్న వర్ణ వ్యవస్థను కుల వ్యవస్థ మార్చాడు. సుమతి భార్గవ అనే బ్రాహ్మణ పండితుడితో మనుధర్మ శాస్త్రాన్ని రచించి దాని ప్రకారమే పరిపాలన సాగించాడు. బౌద్ధుల కాలంలోనే ఉన్న సూద్ర వర్ణంలోని బహుజనులను ఒకరికి ఒకరు కలవకుండా వేలాది కులాలు విభజించారు. వీరికి లొంగకుండా అజ్ఞాతంలోకి వెళ్లి అడవులలో నివసించే బౌద్ధులను, గిరిజనులను లొంగ తీసుకోని అశుభ్రమైన పనులు చేసే అంటరానివారిగా వాడుకున్నారు. మనుధర్మ శాస్త్రం ప్రకారం బహుజనుల కు,మహిళలకు చదువు కోవడం,గుడు లలో ప్రవేశాన్ని నిషేధించింది.
( ఈ మను ధర్మ శాస్త్రమే దేశంలో బాబాసాహెబ్ భారత రాజ్యాంగం అమలు అయ్యే వరకు సుమారు 2100 సంవత్సరాలు అమలు అయింది. నేటికీ తెరచాటున కొనసాగుతూనే ఉంది. )
బౌద్ధం ఈ దేశంలో ఉంటే భవిష్యత్తులో తమ ప్రమాదకరమని గ్రహించిన బ్రాహ్మణ వాదులు రాజుల అండతో బౌద్ధం పై యుద్ధం ప్రకటించి బౌద్ధ భిక్షువులపై దాడులు చేసి చంపి వేయడంతో దేశం నుండి పారిపోయా రు. బ్రాహ్మణ రాజులు బౌద్ధ మత గ్రంథాలను అగ్నికి ఆహుతి చేసి తక్షశిల, నలంద, విక్రమపూరి బౌద్ధ విశ్వవిద్యాలయాలను, బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు. బౌద్ధ జైన ఆలయాలను స్వాధీనం చేసుకుని హిందూ దేవుళ్లను నెలకొల్పారు.నేడు దేశంలోని ప్రసిద్ధిగాంచిన తిరుపతి, అయ్యప్ప దేవాలయాలు ఒకప్పటి బౌద్ధ దేవాలయాలే. బ్రాహ్మణ వైదిక రాజుల పైశాచిక దాడులతో బౌద్ధం పదకొండవ శతాబ్దంలో ఈ దేశం నుండి తరలిపోయింది.
' బౌద్ధం ఈ దేశం నుండి ఎప్పుడైతే తరలిపోయిందో భారతదేశం తనకు తాను ఆత్మహత్య చేసుకుందని' ప్రముఖ కవి గురజాడ అన్న మాటలు అక్షర సత్యాలు బౌద్ధ ధర్మం దేశం నుండి తరలి పోవడంతో ఈ దేశంలో అజ్ఞానాంధకారం లోకి వెళ్ళింది. హిందూ ధర్మం పేరుతో సమాజంలో అసమానతలను సృష్టించి దేశాన్ని అధోగతి పాలు చేసి పాలిస్తున్నారు.

