కాసిపేట ప్రెస్ క్లబ్
ఆధ్వర్యంలో పేద ముస్లీం
యువతి పెళ్లికి సహాయం.
- తమ వంతుసహాయం అందించాలని దాతలకు పిలుపు.
![]() |
| సిరాజ్ ఖాన్ కూతురు వివాహానికి ప్రెస్ క్లబ్ తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్న పాత్రికేయులు. |
Scv News Kasipet :-
కాసిపేట మండల కేంద్రంలోని ముత్యం పెళ్లి గ్రామానికి చెందిన పేద ముస్లిం యువతికి వివాహం కోసం అతని తండ్రికి ఈరోజు కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహయం అందించారు. మండల కేంద్రానికి చెందిన మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్ తన కూతురు వివాహం ఈ నెల 17న ఉండ డంతో వివాహం చేసేందుకు ఇబ్బంది పడుతుండగా విషయాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలియ జేశారు. దీంతో వెంటనే స్పందించిన పాత్రికేయులు కాసిపేట ప్రెస్ క్లబ్ తరుపున తమ వంతు సహాయంగా రూ.10,000 (పదివేల రూపాయలు) అందించారు. ఈ సంద ర్బంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూకట్ల రాజన్న మాట్లాడుతూ పేద యువతి పెళ్లికి మిగితా వారు కూడా తమ వంతు సహాయం అందించి ఆదుకోవాలని దాతలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి ఎస్డీ నజీర్ హుస్సేన్, టంగుటూరి రవి రాజ్, చెట్టి శ్రీధర్, లడ్డూరి రమేష్ కుమార్, గంధం దినేష్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సేవలో భాగంగా పేద ముస్లిం యువతి వివాహానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన మండల ప్రెస్ క్లబ్ సభ్యులకు Scv News సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.
సిరాజ్ ఖాన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన ఉద్యమంలో అవిశ్రాంతి పోరాటం చేసిన నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు. నీతి, నిజాయితీగా ప్రజల కోసం పోరాడే నిరుపేద సిరాజ్ ఖాన్ కూతురు వివాహంకు సహాయం చేయాల్సిన బాధ్యత నేటి సమాజం పై ఉంది. మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, వ్యాపార సంఘాలు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని ప్రెస్ క్లబ్ తో పాటు 'scv news ' కోరుతుంది.
