తాహసిల్దార్
కార్యాలయాన్ని దిగ్బంధం
చేసిన వీఆర్ఏలు.
![]() |
| తాసిల్దార్ కార్యాలయం కి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న వీఆర్ఏలు. |
Scv News kasipet:--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో న్యాయమైన సమస్యలపై గత 77 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో నిరసనగా ఈరోజు వీఆర్ఏ లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల తాహసిల్దార్ కార్యాలయాన్ని తాళం వేసి దిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విఆర్ఎ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో మనోవేదనకు గురై రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది వీఆర్వో లు చనిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల నుంచి జీతాలు రాక కుటుంబం పోషణ భారమై తమ కుటుంబాలు పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని వీఆర్ఏలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ కున్సోత్ శ్రీనివాస్, జిల్లా కో కన్వీనర్ బొడ్డు కార్తీక్, మండల అధ్యక్షులు దుర్గం రాజలింగు , దినేష్, రవి, స్వామీ, రహీమ్ పాల్గొన్నారు
