మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓరియంట్ కార్మిక నాయకుడు వెంగల్ రావు జయంతి

 ఘనంగా ఓరియంట్ కార్మిక

నాయకుడు  వెంగళ రావు

జయంతి వేడుకలు.

 వెంగల్ రావు విగ్రహానికి పూలమాల వేస్తున్న వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, కూతురు అరుంధతి. జడ్పిటిసి పల్లె చంద్ర య్య.

 స్వర్గీయ ఓరియంట్ కార్మిక నేత వెంగల్ రావు.

 కేక్ కట్ చేస్తున్న వెంగళ రావు కూతురు అరుంధతి.

Scv News Kasipet:--

గత మూడు దశాబ్దాలుగా కాసిపేట మండల రాజకీయాలను కనుసైగలతో నడిపి తిరుగులేని నాయకుడిగా ముద్రపడిన ఓరియంట్ మాజీ గుర్తింపు కార్మిక సంఘ అధ్యక్షుడు దివంగత నేత వెంగల్ రావు 67 వ జన్మదినోత్సవ వేడుకలు ముత్యంపల్లి గ్రామం లో ఈరోజు  ఘనంగా జరిగాయి. వెంగళ రావు మండల రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ సర్పంచ్ గా మండల నాయకుడిగా మండల అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించారు. ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో కార్మిక నాయుడు గా పని చేసి నాలుగు సార్లు గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై  కార్మికుల మన్ననలు పొందారు. ఈరోజు స్వర్గీయ పుస్కూరి వెంగళరావు 67వ జయంతి సందర్భంగా ముత్యంపల్లిలో  ఆయన విగ్రహా నికి జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ప్రెసిడెంటు పుస్కూరి విక్రంరావు, వెంగళరావు కుమార్తె అరుంధతి పూల మాలవేసి నివాళి అర్పించారు.

ఈ సందర్బంగా జడ్పీటీసీ పల్లె  చంద్రయ్య మాట్లాడుతూ కాసిపేట మండలంలో కార్మిక నాయకునిగా,మండల ప్రజా ప్రతినిధిగా ముత్యంపల్లి  సర్పంచ్ గా మండలంలొ పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు చెసారని కొనియాడారు.

 కస్తూరిబా పాఠశాల విద్యార్థినిలకు ట్రంకు పెట్టెలు పెట్టుకునేందుకు ర్యాకులు  అందించిన వెంగల్ రావు కుమార్తె అరుంధతి.

అనంతరం మండల కేంద్రం లోని  కస్తూరిభా హాస్టల్ విద్యార్థినిలకు  ట్రంకు పెట్టలు పెట్టు కోవడం కోసం వెంగళరావు జ్ఞాపకార్థం గా కూతురు అరుంధతి  ర్యాకులు అందించారు.ఈ కార్యక్రమంలో  ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిన బాపు, పెద్దనపల్లి యంపిటిసి కొండబత్తుల రాంచెందర్, కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్, కాసిపేట ఉప సర్పంచి సుమన్,  మాజీ జెడ్పిటిసి రౌతు సత్తయ్య,తెరాస మండల ప్రధాన కార్యదర్శి మోటురి వేణు,  తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు జాడి రాంచెందర్, లంక లక్ష్మన్,మల్లెత్తుల సందీప్.మెర్గు శ్రీనివాస్,బలరామ్, సురేందర్, బుగ్గరాజు ఇంతియాజ్ మహ్మద్,అంజి యాదవ్, కస్తూరిభా స్కూలు S O సరిత తదితరులు పాల్గొన్నారు.