మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తుడుం దెబ్బ నాయకులు తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన

డిమాండ్ల పరిష్కారం కోసం

తుడుందెబ్బ నాయకులు

తాహసిల్దార్ కార్యాలయం

ముందు నిరసన.



 తాసిల్దార్ కార్యాలయం ముందు తుడుందెబ్బ నాయకులు నిరసన.

Scv News Kasipet:--

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు కాసిపేట మండలంలో తుడుం దెబ్బ మండలం కమిటీ ఆధ్వర్యం లో ఒక్క రోజు నిరసన దీక్షలు ప్రదర్శనలు చేశారు.తమ డిమాండ్ల ను కాసిపేట RI గారికి మెమో రాండం ద్వారా ఇవ్వడం జరిగింది.

 చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసిల సమస్యలు పరిష్కరించడంతో పూర్తిగా విఫలం  చెందినందున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల్ అధ్యక్షుడు ఆత్రంజంగు, ప్రధానకార్యదర్శి మడావి వెంకటేష్, పెంద్ర శంకర్ ఉపాధ్యక్షు డు, కోశాధికారి పెంద్రం ప్రభాకర్, కుర్సెంగ తిరుపతి సహాయ కార్యదర్శి, తుంరం అర్థు కోవ, వినోద్  చిక్రం,రాందాస్ మడావి, అజయ్ అడలింగు, ఆడ మనోజ్, మడవిదేవ్, తదితరులు పాల్గొన్నారు.