తెలంగాణ ఉద్యమాన్ని
కాసిపేట మండలంలో
ముందుండి నడిపించిన
ఉద్యమకారుడు
రఘుపతిరావు.
- మండల ప్రజా ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర.
![]() |
| ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మండలంలో పాదయాత్రలో నడుస్తున్న ప్రజా ఉద్యమకారుడు రఘుపతిరావు |
![]() |
| ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష లో పాల్గొన్న బన్న ఆశాలు, అప్పటి ఎమ్మెల్యే గుండా మల్లేష్ తో రఘుపతి రావు. |
![]() |
| కొండాపూర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రఘుపతి రావు. |
| Scv News Kasipeta:-- |
కాసిపేట మండల రాజకీయాలను గత మూడు దశాబ్దాలుగా రెండు రకాల నాయకత్వం ముందుండి నడిపించాయి. ఒక నాయకత్వం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారి ప్రజా సమస్యలను పట్టించు కోకుండా అగ్రకుల అహంకారం, నిలువెల్ల స్వార్థంతో అధికార వర్గానికి దాసోహం గా పనిచేసింది. మరొక నాయకత్వం నిస్వార్థంతో, నిజాయితీగా నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాలక వర్గాలకు వ్యతి రేకంగా ప్రజా ఉద్యమాలకు ముందుండి నడిపించాయి.అధికారపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంలో అధిష్టానం ఆదేశాలను కూడా దిక్కరించి ప్రజల పక్షాన పోరాడేవాడు. ప్రజా పక్షం ఉండి ప్రజా సమస్యలపై పోరాడిన ప్రజా పక్షపాతి రఘుపతి రావు. మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలకు రఘుపతిరావు ముందుండి నడిపించి మండలానికి మార్గదర్శిగా నిలిచారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన నిలిచి ఉద్యమాలు సాగించిన సందర్భంలో అప్పటి టిడిపి పార్టీ అధికారపక్షంలో వున్నా మండలంలోని స్వార్థపూరిత, అరాచక నాయకత్వం చేతిలో రఘుపతిరావు ఎన్నో అవమానాలకు, దాడులకు గురైన సందర్భాలు ఉన్నాయి. అయినా వారికి భయపడకుండా ప్రజల పక్షం నిలిచి ఉద్యమాలు సాగించిన నిజాయితీ గల ఉద్యమకారుడు రఘుపతి రావు.
![]() |
| కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ nsui కార్యక్రమం లో పాల్గొన్న రఘుపతి రావు. |
సింగరేణి యాజమాన్యంవల్ల మండల కేంద్రంలోని ప్రజలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. వాటిని పరిష్కరించే హోదాలో ఉన్న అధికారపక్షం యాజమాన్యంతో కుమ్మక్కై పైరవీలు చేసుకుని పబ్బం గడుపుకునే వారు. రఘుపతి రావు మాత్రం సింగరేణి యాజమాన్యం పై ప్రతిపక్ష హోదాలో ప్రజల కోసం రాజీలేని పోరాటాలు చేశాడు. కాసిపేట బొగ్గుగని తవ్వకాల వల్ల కాసిపేట ముత్యం పల్లి రెండు గ్రామాలలో భూగర్భజలం ఇంకి పోయి ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. తాగునీటి కోసం ప్రజలతో కలిసి సింగరేణి యాజమాన్యంపై ప్రజాఉద్యమంకు నాయకత్వం వహించారు. కాసిపేట మండల కేంద్రం లోని గ్రామాలను బొందల గడ్డగా మార్చే కాసిపేట ఓపెన్ కాస్ట్ గని వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి రద్దు అయ్యేం తవరకు సింగరేణి యాజమాన్యంతో అవిశ్రాంతి పోరాటం ముందుండి నడిపాడు.
అందరినీ కలుపుకొని పనిచేసాడు, అందరి మాటకు విలువిచ్చారు.
![]() |
| అప్పటి ఈనాడు పాత్రికేయుడు కీ.శే. పల్లె క్రాంతి కుమార్ తో రఘుపతి రావు. |
మండలం లో ప్రత్యేక తెలంగాణ
ఉద్యమాన్ని అన్ని తానై ముందుండి
నడిపిన రఘుపతి రావు .
ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కాసిపేట మండలంలో రఘుపతి రావు గ్రామ గ్రామన విస్తరించి ముందుండి నడపడం లో క్రియాశీల పాత్ర పోషించాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేతకు గురి చేస్తున్న, అధికార పార్టీకి మండల అధ్యక్షుడుగా, మండల పరిషత్తు అధ్యక్షుడిగా ఉండి అధిష్టానం ఆదేశాలను లెక్క చేయకుండా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మండలంలోని ప్రజా సంఘాలు మూడు రోజుల పాదయాత్ర కు పూర్తి సహకారం ఇచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధన కోసం శాంతియుత పద్ధతిలో చేసే రాస్తారోకో, వంటా-వార్పు, నిరాహారదీక్షలను , కుల సంఘాల ఉద్యమాలలో ముందుండి నడిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాధించేవరకు, మండల కేంద్రంలో బత్తుల మధు, కాసిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద బన్న ఆశాలు, కొండాపూర్ యాప చౌరస్తాలో దుర్గం పోషం చేసిన ఆమరణ నిరాహార దీక్షలకు పూర్తి మద్దతు ఇచ్చి నడిపించారు. పోలీసులు అమరణ నిరాహార దీక్షలను భగ్నం చేసిన తర్వాత కాసిపేట, కొండాపూర్, ధర్మారావు పేట్, దేవాపూర్, సోమగూడెం లో 40 నుండి 50 రోజుల వరకు సుధీర్ఘ రిలే నిరాహార దీక్ష శిబిరాలకు ఆర్థిక అండ దండల తో పాటు ప్రతిరోజు గ్రామస్తులతో దీక్షా శిబిరాలలో పాల్గొనేవాడు. అప్పటికి అనారోగ్యానికి గురై శ్వాస కోశ క్యాన్సర్ వ్యాధి తీవ్రత పెరిగి మంచానికే పరిమితం అయ్యా డు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ ఉత్సవాన్ని చూడకుండా నే 2012 అక్టోబర్ 19 న రఘుపతి రావు అమరుడయ్యాడు.
రఘుపతి రావు మృతి మండలానికి తీరనిలోటు.
మండల ప్రజలకు నాలుగు దశాబ్దాలు గా నిస్వార్థ సేవ లు అందించిన స్వర్గీయ రఘుపతి రావు సేవలు మరువలేనివి. చరిత్రలో ప్రజలకోసం పనిచేసిన నాయకులను ప్రజలు ఎల్లప్పుడూ తమ గుండెల్లో దాచుకుంటారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ తమ స్వార్ధ ప్రయోజనాలకు అరాచకాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన నాయకులు చరిత్రహీనులుగానే మిగులుతారనేది చారిత్రక సత్యం.
మండల రాజకీయాలలోకి వచ్చే నేటి యువతరం సర్పంచులు ఎంపీటీసీలు రఘుపతి రావు లాంటి మహా నాయకు డిని స్ఫూర్తిగా తీసుకొని, నీతినిజాయి తీ గా ఉంటూ నైతిక విలువలను కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు ఎల్లప్పు డు గుర్తుంచుకుంటారు. నేటి యువతరం ప్రజాప్రతినిధులు రఘుపతి రావు ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని Scv News ఆశిస్తుంది..
note :- సామాజిక చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ లో ప్రజా నాయకుడు రఘుపతి రావు గురించి ప్రత్యేక కథనం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. మండల ప్రజలు చూడగలరు. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాము







