భారతదేశంలోని రెండు
మహా విప్లవాలైన సింధు
నాగరికత, బౌద్ధం విప్లవాల
గురించి తెలుసుకుందాం.!
- ఆర్య మనువాద బ్రాహ్మణ ప్రతిఘాతక విప్లవాల వల్లనే రెండు మహా విప్లవాలు ధ్వంసం అయ్యాయి.
- ఫలితంగా నేటికీ బహుజనులు బానిసల్లా బతుకు తున్నారు.
- భారతదేశంలోని కి వచ్చిన మొట్టమొదటి విదేశీ దండ యాత్రికులు ఆర్య బ్రాహ్మణులు.
- ఆర్యులు విదేశీయులే నని తేల్చిన అస్తిపంజరం.
![]() |
| బ్రిటిష్ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ మొహంజదారో నగరం. |
![]() |
| పురావస్తు శాఖ తవ్వకాలలో బయల్పడిన హరప్పా నగరంలోని ఆధునాతన డ్రైనేజీ సిస్టం. |
Scv News Kasipet:--
ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేని విధంగా భారతదేశం వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశంలో మూడు కాలాలు,ఆరు రుతువుల ద్వారా నిరంతరం వర్షాలు పడి గంగా,సింధు, బ్రహ్మపుత్ర లాంటి సజీవ నదుల ప్రవాహం, సారవంత మైన డెల్టా భూములు, గడ్డి మైదానాలు ఉండడంవల్ల వ్యవసాయ పరంగా, ఎంతో అభివృద్ధి సాధించి సస్యశ్యామల దేశంగా ప్రపంచం లో గుర్తింపు సాధించింది.ఈ దేశ వాతావరణ పరిస్థితుల కారణంగానే దేశ తరిగిపోని సంపదను చూసి విదేశీ యులు యుద్ధాలు చేసి ఈ దేశాన్ని ఆక్రమించు కునేందుకు ప్రధాన కారణం.
ఈ దేశ మూలవాసుల మొదటి మహా విప్లవం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం...!
భారతదేశ చరిత్ర ద్రావిడుల సింధు నాగరికతతో మొదలు కావలసి వున్నా ఆర్యుల ఋగ్వేదంతో మొదలైం ది. సింధు నాగరికత క్రీస్తు పూర్వం 3000 నుండి 1500 సంవత్సరాల వరకు కొనసాగిందని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆర్యులు దక్షిణాసియా ప్రాంతానికి చెందిన స్థిరనివాసం లేని సంచార జాతికి చెందిన వారు. పశుపోషణ వీరి ప్రధాన వృత్తి. పశువులను మేపుతూ గంగా, సింధూ నది పరివాహక ప్రాంతాలలోని పచ్చని గడ్డి మైదానాలు, పచ్చని పంటలతో కళకళ లాడుతున్న వ్యవసాయ భూములను, ద్రావిడుల నగరాలను చూసి ఈర్ష చెందా రు.గుర్రాలు విల్లంబులతో వచ్చి ద్రావిడ చక్రవర్తులను ఓడించి నగరాలను ధ్వంసం చేసి ఈ ప్రాంతం మొత్తం తమ ఆధీనంలో కి తెచ్చుకున్నారు. భారతదేశంలోకి వచ్చిన మొట్టమొదటి విదేశీ దండ యాత్రికులు ఆర్యులు. ఆర్యులు వందల సంవత్సరాలు యుద్ధాలు చేసి ఈ దేశం మూల వాసుల సింధు నాగరికతను ధ్వంసం చేసి ద్రావిడ రాజులను రాక్షసులుగా చిత్రీకరించి పురాణాలు రాసుకున్నారు. ద్రావిడ ప్రజలు నిర్మించిన నగరాలను చరిత్రలో ఆనవాలు లేకుండా ధ్వంసం చేసి మూలవాసులైన ద్రావిడ ప్రజలను బానిసలుగా చేసుకొని పరిపాలన సాగించారు.
ఆర్యుల దాడులు, విధ్వంసాలకు బుగ్వేదంలోని వేదమంత్రాలు ప్రధాన సాక్ష్యం.
ఆర్యులు దండయాత్ర లు చేసి సింధు నగరాలను స్వాధీనం చేసుకుని యజ్ఞయాగాలు పేరిట వందలాది పశువులను సంహరించి మందు విందులతో జల్సా చేసుకున్నారు.వీటికి ఆర్య బ్రాహ్మణల పవిత్ర గ్రంథాలైన ఋగ్వేదం, యజుర్వేదం లోని వేద మంత్రాలే ప్రధాన సాక్ష్యాలుగా నేడు నిలుస్తున్నాయి. ఆర్య - అనార్య ద్రావిడ చక్రవర్తుల మధ్య జరిగిన యుద్ధాలు, నగరాల ధ్వంసం చేయడం వారి నాయకుడు ఇంద్రుని పొగుడుతూ రాసుకున్న మొదటి గ్రంథమే రుగ్వేదం. ఆర్యుల నాయకుడు ఇంద్రుడు కి పురందేశ్వరు డు' (నగరాలను ధ్వంసం చేసిన వాడు), 'రోధంసి కృత్రిమాని ' అంటే ( నీటిని అడ్డుకునేందుకు కృత్రిమ కట్టడాలను తొలగించిన వాడు ) అనే బిరుదులు కూడా ఋగ్వేద మంత్రాలలో ఉన్నాయి. నీటి నిల్వ చేసే చెరువులను కట్టి కాపాడిన ద్రావిడ ఇంజనీర్ వృత్తాసురుడు చంపి కట్టాలను తెంచినందుకు ఇంద్రుడి ని కీర్తి స్తు బుగ్వేదం లో 500 శ్లోకాలు ఉన్నాయి. ఇంద్రుడు దాసులు, దస్యులు అంటే ద్రావిడ రాజు లకు చెందిన 99 నగరాలను ధ్వంసం చేసిన పురందేశ్వరుడని రుగ్వేదంలో ఇంద్రుని గూర్చి కీర్తించారు. ఇలా ఆర్యుల విధ్వంసాలు కొనసాగాయి.
ప్రపంచ దేశాలకు ఎంతో జ్ఞానాన్ని నేర్పినవారు సింధు ప్రజలు.
ఆర్యులు భారతదేశం లోకి రాకముందు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా సింధు నాగరికత విలసిళ్ళింది.ప్రపంచంలోనే మొట్ట మొదట సింధు ప్రజలు కాల్చిన ఇటుకలతో భవనాలను నిర్మించు కున్నారు.భూగర్భ డ్రైనేజీ లు, మహా స్నానఘట్టాలు నిర్మించుకున్నారు. నీరు వృధాగా వెళ్ళి సముద్రంలో కలవకుండా ప్రవహించే వాగులు నదులపై ఆనకట్టలు నిర్మించారు. ప్రపంచంలోనే మొదట పత్తి, బార్లీ గోధుమ పండించిన రైతులు సింధు ప్రజలు. కుల వృత్తుల ద్వారా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. పత్తితో నూలు వస్త్రాలు తయారుచేయడం,అగ్గిపెట్టె లో చీరలను పెట్టే విధంగా పలచని వస్త్రాలను, బంగారంతో చీరలు నేయడం, వర్షంలో తడవకుండా, చలిలో వెచ్చదనంగా, ఎండలో చల్లదనంగా ఉండే నానోటెక్నాలజీ గొర్రెల వెంట్రుకలతో చేసిన గొంగడి సింధు ప్రజల నైపుణ్యానికి నిదర్శనం. కుమ్మరి కుండలు తయారు చేయడం, కాల్చడం, కమ్మరులు నాగళ్లు తయారు చేయడం, రాగి, తగరం కలిపి బలమైన కంచు తయారీ చేయడం, విశ్వ బ్రాహ్మణులు బంగారు ఆభరణాలు తయారు చేయడం, రజకులు బట్టలు శుభ్రం చేసేందుకు సౌడు మట్టి ఉపయో గించడం, మంగలి వాళ్ళు గడ్డం తీసే టప్పుడు ఒకరికి ఒకరు కత్తితో తీయడం వల్ల సెప్టిక్ కాకుండా పశువుల తోలుపై కత్తిని రాయడం లాంటి ఎన్నో శాస్త్రీయమైన ఆవిష్కరణ లు సింధు ప్రజలు చేశారు. వైద్య పరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందారు. ద్రావిడ ప్రజలు ఎలాంటి దురలవాట్లు లేని శాంతికాముకులు. యుద్ధాలకు వెళ్లకుండా నీటిని నిల్వ చేసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పండిన పంటలను సముద్ర యానం ద్వారా వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు.
ఆర్య గుంపుల దాడులతో ధ్వంసమైన సింధు నాగరికత.హరప్పా మొహంజదారో తవ్వకాలతో వెల్లడి.
ప్రపంచంలోనే గొప్ప నాగరికత గా విలసిల్లిన సింధు నాగరికత ఆర్య గుంపుల దాడులు యుద్ధాలతో ధ్వంసమైంది. బ్రిటిష్ వారి కాలంలో 1922లో ప్రస్తుత పాకిస్థాన్ లో రైల్వే నిర్మాణం కోసం సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో తవ్వకాలు చేపట్టగా హరప్పా, మొహంజదారో సింధూ నాగరికతకు చెందిన పట్టణాలు వెలుగు చూశాయి.హరప్పా మొహంజదారో పట్టణాలలోని నగర నిర్మాణాలను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. అత్యాధునిక టెక్నాలజీతో కాల్చిన ఇటుకలతో రెండు మూడు అంతస్తుల భవనాలు, విశాలమైన వీధులు, వ్యాపార సముదాయాలు భూగర్భ డ్రైనేజీలు స్నానఘట్టాలు, మైదానాలు బయల్పడ్డాయి. అవన్నీ ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు నేటి బహుజనుల కట్టడాలే నని హరప్పా మొహంజదారో తవ్వకాలతో బాహ్య ప్రపంచానికి తెలిసింది.
- ఆర్యులు విదేశీయులే నని తేల్చిన అస్తిపంజరం.
దేశంలోని మనువాద బ్రాహ్మణ వర్గం ఆర్యుల దండయాత్ర లు బూటకమని విదేశీయుల కుట్రాలని మేము ఈ దేశ మూలవాసులమేనని ప్రచారం చేసు కుంటున్నారు. వారి మోసపూరిత ప్రచారానికి తెరదించింది 4 వేల నాటి అస్తిపంజరం.గుజరాత్ లోని రాఖీగార్ ప్రాంతంలో సింధు నాగరికత కాలంలోనే పట్టణాల తవ్వకాలలో లభించిన సుమారు 4,500 సంవత్సరాల నాటి అస్తిపంజరంను ఉత్తర ప్రదేశ్ లక్నోలోని బీర్బల్ సాహిణి ఇనిస్ట్యూట్ వారు ఆధునాతన టెక్నాలజీ ద్వారా డీఎన్ఏ టెస్ట్ చేయడం దక్షిణభారతం వారి డిఎన్ఎ కు దగ్గరగా ఉండడం వల్ల ఈ దేశం పై ఆర్యుల దండయాత్ర నిజమేనని వెల్లడయ్యాయి.
గంగా, సింధు నగర ప్రాంతాలలో ఈ దేశం మూలవాసులైన రాజులతో క్రీస్తు పూర్వం 1500 నుండి 800 వరకు యుద్ధాలు యుద్ధాలు చేసి ఉత్తరభారతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆర్యులు ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాన్ని ఆర్యావర్తనం అంటారు. యుద్ధాలలో ఓడిపోయిన ఈ దేశం మూలవాసులైన ద్రావిడ ప్రజలను బానిసలుగా చేసుకొని పరిపాలన చేసేందుకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు,ధర్మశాస్త్రాలు లిఖించి వాటి ప్రకారమే పరిపాలన చేశారు.యజ్ఞ యాగాదుల పేరిట పెద్ద ఎత్తున జీవహింస చేస్తూ దోపిడీలకు పాల్పడ్డారు.మనుషులను నాలుగు వర్ణాలుగా విభజన చేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,మూడు వర్ణాలకు ఈ దేశంలోని మూలవాసులైన నేటి బహుజనులు సేవ చేయడమే ధర్మం అన్నారు. ధర్మం తప్పి వ్యవహరించిన వారిపై కఠిన శిక్షలు విధించారు. గత మూడు వేల సంవత్సరాల నుండి నేటి వరకు ఈ దేశంలోని మూలవాసులైన బహుజనులు బానిసలు గానే జీవిస్తున్నారు.
( రేపు.. రెండవ మహా విప్లవం బౌద్ధం గురించి )

