మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట పోలీసుల అదుపులో వీఆర్ఏలు

కాసిపేట పోలీసుల 

అదుపులో మండల

వీఆర్ఏలు.

-- అరెస్టులతో వీఆర్ఏల గొంతులను నొక్కలేరు,వీఆర్ఏల జిల్లా జేఏసీ కమిటీ.

 కాసిపేట పోలీసుల అదుపులో మండల విఆర్ఎల్ 

Scv News Kasipeta:- 

 వీఆర్ఏలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కోసం గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి నందుకు నిరసనగా ఈరోజు హైదరాబాద్లో జరిగే మహిళా గర్జనసభను ఏర్పాటు చేసుకున్నారు. సభ కు వీఆర్ఏలు వెళ్లకుండా కాసిపేట పోలీసులు ముందస్తు గా  దుర్గం రాజలింగు, రహీం,  శ్రీనివాస్ లను  అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని వివిధ మండలాల వీఆర్ఏల ను మంచిరాల పోలీస్ స్టేషన్లో  అదుపులోకి తీసుకొని నిర్బంధించారు.

 దీన్ని పురస్కరించుకొని వి ఆర్ ఏల సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కున్సోతు శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. అర్ధరాత్రి పూట కుటుం బం తోటి ఉండాల్సిన విఆర్ఏలను అరెస్టు చేయడం దారుణ మని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించి న నిరసనను తెలియజేసే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామనేది అసెంబ్లీలో ప్రకటిం చింది సీఎం గారు, ఇవ్వకుండా రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే కాలయా పన చేసి వీఆర్ఏలను ఈ ప్రభుత్వమే ఇబ్బంది పెడుతుందని అన్నారు. సీఎం గారి మాటను ఇంప్లిమెంట్ చేయనందు కు ఇవాళ వీఆర్ఏల మీద నిర్బంధ కాండ కొనసాగుతుందని అన్నారు. బతుకమ్మ రోజు దసరా రోజు అని చూడకుండా పండగ పూట వీఆర్ఏ లను అరెస్టు చేశారు ఈరోజు కూడా మళ్లీ వీఆర్ఏలను జిల్లాలో వందమంది వీఆర్ఏలను అరెస్టులు చేశారు అనడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సకల జనుల సమ్మెలో వీఆర్ఏలు చాలా కీలకమైన పాత్రను పోషించారని ఇవాళ పోరాడి సాధించుకున్న తెలంగాణలో వీఆర్ఏల హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తుం దని బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి సీఎం గారి హామీని తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రకటనలో  హెచ్చరించారు.