పునరావాస పరిహారం
తక్కువ వచ్చిందని
దుబ్బగూడం ప్రజలు కలెక్టర్
కు ఫిర్యాదు.
![]() |
| పరిహారం తక్కువ వచ్చిందని కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్న దుబ్బగూడం పునరావాస కాలనీ ప్రజలు |
ScvNews Kasipet:--
కాసిపేట మండలం కేకే పునరావాస గ్రామం దుబ్బగూడం ప్రజలకు పరిహారం తక్కువ వచ్చిందని దుబ్బగూడం గ్రామం కమిటీ అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. పునరావాస ప్యాకేజీ కింద ఇచ్చే పరిహారంలో అవకతవకలు జరిగాయని వీటిపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని ఫిర్యాదులు కోరారు. రీసర్వే చేయాలని, పునరావాస ప్యాకేజీ 18 సంవత్సరాల నిండిన వారి లిస్టును ప్రకటించాలని కోరారు.
