గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచి నందుకు కెసిఆర్ చిత్రపటానికి తుడుం దెబ్బ నాయ కులు పాలాభిషేకం.
![]() |
| దేవాపూర్ లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న తుడుందెబ్బ నాయకులు. |
ScvNews Kasipet:--
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి జీవో జారీ చేసినందుకు కాసిపేట మండలం తుడుందెబ్బ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు దేవాపూర్ లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్య క్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు మద్దిమడుగు సర్పంచి ఆడే జంగు, వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం హనుమంతు, జిల్లా ఉపాధ్యక్షుడు మాడవి అనంతరావు, రైతు సంఘం కోఆర్డినేటర్ రాయి సిడం రామ్ దాస్, దెబ్బ నాయకులు సోయం సూరు, నాయిని మల్లేష్, ధర్మారావు, రోడ్డ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
