కాసిపేట మండలంలో
ఇందిరా గాంధీ వర్ధంతి
కార్యక్రమం.
![]() |
| ఇందిరాగాంధీ విగ్రహా నికి పూలమాల వేస్తున్న ఎంపీటీసీ పార్వతి మల్లేష్. |
Scv News Kasipet :--
భారత దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఈరోజు కాసిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, ధర్మ రావు పేట ఎంపీటీసీ పార్వతి మల్లేష్ ఆధ్వర్యంలో గోలేటి స్వామి మైధం రమేష్,షాకీర్జా,డి శివ పూలమాల వేశారు.ఈ సందర్భంగా సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి ఎనలేని సేవలు చేశారని, వారి హాయంలో బ్యాంకుల జాతీయకరణ, రాజభరణల రద్దు గ్రామీణ ప్రజలకు స్వపరిపాలన అందించిన గొప్ప నేత అని కొనియాడారు.
జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
![]() |
| ఇంద్ర గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రత్నం ప్రదీప్. |
జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా రత్నం ప్రదీప్ మాట్లాడుతూ ఈరోజు భారతదేశ అభివృద్ధి చెందిందంటే అదంతా ఇందిరాగాంధీ కృషి ఏనని అన్నారు. సామాన్య ప్రజలకు బ్యాంకుల సేవలు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇందిరా గాంధీ అని కొనియాడారు. దేశా ఐక్యత కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం భారత్ జూడో యాత్ర ఇందిరా గాంధీ మనవడు రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నాడు అన్నారు. ఈ కార్యక్రమంలో గుండా రాజ్ కుమార్,ఇషారపు శారద,పల్లపు మహంకాళి,సల్లూరి సమీర్ కుమార్,జాడి మల్లేష్, ప్రణయ్ కుమార్, కోట ఆదర్శ, సంకుర్ రాజ్ కుమార్ పద్మ,పోసు తదితరులు పాల్గొన్నారు.

