కాసిపేట గనిపై హెల్మెట్
వాడకం లో కార్మికులకు
అవగాహన.
![]() |
| కార్మికులనూద్దేశించి మాట్లాడుతున్న ఏరియా రక్షణ అధికారి ఓదెలు. |
![]() |
| కార్మికులనూద్దేశించి మాట్లాడుతున్న ఎజంట్ కుర్మ రాజేందేర్. |
ScvNews Kasipet:--
కార్మికులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకు నేందుకు మందమర్రి ఏరియా కాసిపేట -1 గని కార్మికులకు ఈరోజు హెల్మెట్ వాడకంపై ఏరియా రక్షణ అధికారి ఓదెలు, గ్రూపు ఏజెంట్ రాజేందర్ అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఏరియా రక్షణ అధికారి ఓదెలు మాట్లాడుతూగనిలో పని చేస్తున్న ఉద్యోగులకు కాసిపేట గనిని ప్రమాద రహిత గనిగా పేరు తెచ్చేందుకు అధికారులు, కార్మికులు కృషి చేయాలని అన్నారు.
కాసిపేట గని గ్రూప్ అఫ్ ఏజెంట్ కుర్మ రాజేందర్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు,గత సోమవారం డ్యూటీ కి బయలుదేరిన ఉద్యోగి ప్రమాదవశాత్తు లారీ డీకొట్టడం తో అక్కడికక్కడే మృతి చెందాడని, అతను హెల్మెట్ వాడి ఉంటే ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు. ఇంటి నుండి బయలుదేరినప్పుడే హెల్మెట్ పెట్టుకొని ప్రమాదాల నుండి బయట పడాలని అన్నారు. గని మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ రక్షణతో ఉత్పత్తి ని తీయాలని అన్నారు.గని కి నూతనంగా బొగ్గు తీయుటకు పర్మిషన్ వచ్చినవని,స్టౌయింగ్ మెటీరియల్ కూడా జనరల్ మేనేజర్ గారి కృషితో వచ్చాయని అన్నారు. ముందుగా AITUC, TBGKS ప్రతినిధులు బియ్యల వెంకట స్వామి, ఒడ్నాల రాజన్న మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి సునీల్ కుమార్, ఇంజనీర్ బాబు,మధుకర్, అనిల్,అండర్ మేనేజర్ సుమన్,సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషా,నాయకులు పాల్గొన్నారు.

