మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 కాసిపేట మండలంలో ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమాలు.

 కాసి పేట మండల కేంద్రంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం.

ScvNewsKasipet:--

 కాసిపేట మండలంలో వివిధ గ్రామాలలో ఈరోజు గాంధీ జయంతి కార్యక్రమాలు కాసిపేట దేవాపూర్ ధర్మారావుపేట సోనాపూర్ నాయకపు గూడెం గ్రామాల్లో  ఘనంగా జరిగాయి.

కాసిపేట మండల కేంద్రంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు విక్రమ్ రావు ఆధ్వర్యంలో  తెరాస నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా విక్రమ్ రావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రజలను హింస మార్గం వెళ్లకుండా శాంతియుతంగా బ్రిటిష్ వారిపై పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చాడని కొనియాడారు. మనమంతా గాంధీ బాటలో పయనించి మహాత్ముని ఆశయాలను కొనసాగించా లని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కొండ బత్తుల రామ్ చందర్, అక్కపల్లి లక్ష్మి, కాసిపేట ఉప సర్పంచ్ పిట్టల సుమన్, కాసిపేట తెరాస  గ్రామ కమిటీ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, తెరాస నాయకులు అట్టపల్లి శ్రీనివాస్,బుఖ్య రామచందర్, బుగ్గ రాజు, సిద్ధం రాములు తదితరులు పాల్గొన్నారు.

దేవపూర్ మేజర్ పంచాయతీలో

 దేవాపూర్ పంచాయితీలో సర్పంచి తిరుమల ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం 
దేవాపూర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మాడవీ తిరుమల ఆధ్వర్యం గాంధీ జయంతి జన్మదిన కార్యక్రమాలు జరిగాయి. సర్పంచి తిరుమల, పంచాయతీ కార్యదర్శి గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి లార్పించారు. ఈ కార్యక్రమం లో  తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు అనంతరావు, తెరాస నాయకులు కైలాస్ వార్డు సభ్యులు స్థానికులు పాల్గొన్నారు.

ధర్మారావు పేట లో..

 ధర్మ రావు పేట లో  ఎమ్ పి టి సి పార్వతి మల్లేష్, ఏం సి డైరెక్టర్ మంజుల రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం.

ధర్మారావు పేట పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక ఎంపీటీసీ పార్వతి మల్లేష్, ఏం సి డైరెక్టర్ మంజుల రెడ్డి ల ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి, శేఖర్ రావు, నేరెళ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

సోనాపూర్ నాయకపుగూడెం లో...

 సోనాపూర్ నాయకపు గూడెంలో బద్ది శ్రీను ఆధ్వర్యం 

సోనాపూర్ నాయకపు గూడెంలో నాయకపోడ్ సేవా సంఘం అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. బద్ది శ్రీనివాస్  గాంధీ చిత్రపటానికి  పూల మాల వేసి నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు పాల్గొన్నారు.