మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా దీపావళి పండుగ

  ఘనంగా దీపావళి పండుగ.

 దీపావళి పండుగ సందర్భంగా ఇప్పల గూడెం ధ్యాన మందిరంలో వృద్ధులకు పూజలు చేస్తున్న పులాజి బాబా భక్తులు.

Scv News Kasipet:--

కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇండ్ల ముందు దీపాలు వెలిగిస్తూ లక్ష్మి పూజలు చేసుకున్నారు.  బాణాసంచా లను కాల్చారు. గట్రావ్ పెళ్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పల గూడెం ధ్యాన మందిరంలో పశువులకు ఎద్దులకు పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆదివాసీల సంస్కృతిలో భాగమైన తాతల తండ్రుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఎద్దులకు స్నానం చేయించి అలంకరణ చేసి పూలు పత్రి తో పూజలు నిర్వహించి ఎద్దులకు నైవేద్యం పెట్టి సామూహిక పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సోనాపూర్ బాదు గూడెంకు చెందిన పులాజి బాబా భక్తులు కనుక మానుకు,  వెడమ్మ యశ్వంతరావు,తిరుపతి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.