ఓరియంట్ ఆవరణలో దండారి దర్బార్ పోస్టర్ విడుదల.
![]() |
| ఓరియంట్ కర్మాగార ఆవరణలో దండారి దర్బార్ పోస్టర్ విడుదల చేస్తున్న ప్రెసిడెంట్ ఎస్కే పాండే. |
Scv News Kasipeta:--
కాసిపేట మండలం మద్దిమడుగు పంచాయతీ పరిధిలోని సలపాలవాగు వెంకటాద్రి దేవాలయం వద్ద ఈనెల 20 21 జరిగే దండారి దర్బార్ వాల్ పోస్టర్ ను ఈరోజు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆవరణలో ప్రెసిడెంట్ ఎస్ కె పాండే, హెచ్ ఆర్ జి ఎం కులకర్ణి చేతుల మీదుగా నిర్వహణ కమిటీ, గిరిజన సంఘాల నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఆడే జంగు, మడావి హనుమంతరావు, పెంద్రం హనుమంతు, పేద్రం రాజు, రాందాస్ , కనకరాజు,సురు ధర్మారావు, జంగు, గోవర్ధన్, రాజు, చంద్రరావు,రంజిత్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
