దేవాపూర్ లో ఘనంగా
అశోక విజయదశమి
కార్యక్రమం.
![]() |
| దేవాపూర్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అశోక విజయ దశమి కార్యక్రమం. |
![]() |
| అశోక విజయదశమి కార్యక్రమంలో బౌద్ధ ప్రార్థన. |
![]() |
| అశోక విజయ దశమి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న అంబేద్కర్ సంఘం నాయకులు. |
![]() |
| అశోక విజయ దశమి సందర్భంగా బుద్ధుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న బుద్ధి సొసైటీ సభ్యులు. |
Scv News Kasipet :--
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ లోని అంబేద్కర్ భవన్ ఆవరణలో ఈరోజు అశోక విజయ దశమి కార్యక్రమం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం నాయకులు బుద్ధి సొసైటీ సభ్యులు అంబేద్కర్, బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. పంచశీల జెండాను అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ గసికంటి మల్లేష్ ఎగరవేశారు. బుద్ధిష్ట్ సొసైటీ సభ్యులు బౌద్ధ ప్రతిజ్ఞ చేశారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ములబాపు మాట్లాడుతూ విజయదశమి రోజు మనువాదులు జమ్మి పూజ చేసే విధానం ఉందన్నారు. బహుజనుల మంతా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా, అంబేద్కర్ రాజ్యాంగం వల్ల మనకు ఎన్నో హక్కులు కల్పించిన వాటిని ఉపయోగించుకోలేక పోతున్నాం అన్నారు . బహుజనులు ఆలోచనా విధానం మారాలని మనువాదుల ప్రలోభాలకు లొంగి హక్కులను తాకట్టు పెట్టి బ్రతక వద్దాన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ మాట్లాడుతూ దేవాపూర్ అంబేద్కర్, పూలే ఆలోచనలతో అశోక విజయ దశమి దేవాపూర్ లో జరుపుకుంటు న్నామన్నారు.మనోహర్ కాంబ్లీ ఆధ్వర్యంలో బుద్ధ ప్రచారం కూడా చేస్తున్నామన్నారు. అంబేద్కర్ ఆలోచన కు సంబంధించిన కార్యక్రమాలన్నీ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తామన్నారు.
అంబేద్కర్ సంఘం దేవాపూర్ పట్టణ అధ్యక్షుడు గసికంటి మల్లేష్ మాట్లాడుతూ దసరా బ్రాహ్మణ మనువాదులు వక్రీకరించి జరుపుతున్నారన్నారు. అశోక చక్రవర్తి కలింగా ను జయించిన సందర్భంగా చేసిన పది రోజుల పండుగే దసరా పండుగ అన్నారు. అశోకుడు బౌద్ధ భిక్షువు వద్ద ఆయుధాలను విడిచి బౌద్ధన్ని స్వీకరించిన రోజని గుర్తు చేశారు.
బుద్ధిస్ట్ సొసైటీ సభ్యురాలు బుద్ధిస్ట్ సొసైటీ సభ్యురాలు సంగీత కాంబ్లే మాట్లాడుతూ కర్ణాటకలో దేవాలయం లో విగ్రహం ముట్టుకున్నా అందుకు దళిత కుటుంబానికి జరిమాన వేయడం దారుణం అన్నారు. జరిమాన ను నిరసిస్తూ అంబేద్కర్ బుద్ధుని ఫోటోలతో నిరసన చేసినందుకు గ్రామ ప్రజలంతా వారికి మద్దతుగా దేవాలయం మీ ఆక్రమించి గోపురం ఎగురవేయడం సంతోష కరమన్నారు.
ఈ కార్యక్ర మంలో అంబేద్కర్ యువజన సంగం మండల సలహాదారు రామిళ్ళ కిష్టయ్య, సభ్యులు గాదె మహేష్,నాథరి పోశం,ముల్కల స్వామి,చిప్పకుర్తి బాపు, కొమ్ము సంతోష్, గోనె రవి అట్కాపూర్ రమేష్, రామిల్ల వెంకటేష్, తాము టైంకి శ్రీనివాస్,బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు రాజు పాలేకర్ సంతోష్,సంధిప్ మహిళా కమిటీ సభ్యులు సంగీత కాంబ్లే రజనీ పాలేకర్, కవిత తదితరులు పాల్గొన్నారు.









