సల్పాల వాగులో దండారి
దర్బార్ సన్నాహక
సమావేశం.
![]() |
| సల్పాల వాగు లో దండారి ధర్భర్ సన్నాహక సమావేశం కు హాజరైన మండల గిరిజన నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం మద్దిమాడ పంచాయతీ పరిధిలోని సలపల వాగులో ప్రతి దీపావళి ముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో దండారి దర్బారు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ నెల 23న నిర్వహించే దండారి దర్బార్ ను విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులు దండారి నిర్వాహకులు సమావేశమై దండారి దర్బార్ లో పాల్గొనే 14 దండారి లు 22వ తేదీ సాయంత్రం వరకు శిల్పాల వాగులోని వెంకటాద్రి దేవాలయానికి చేరుకోవాలని నిర్ణయించు కున్నారు.
ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మద్దిమాడ సర్పంచ్ ఆడే జంగు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం దండారి ధర్భర్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండలం లోని అన్ని వర్గాల వారు, గిరిజనేత రులు కూడా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఓరియంట్ యాజమాన్యం దండారి దర్బార్ కార్యక్రమానికి అవసరమైన టెంట్లు భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. సమావేశంలో నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయి సిడం రాందాస్,కోశాధికారి సోయం సూరు. నిర్వహణ కమిటీ సభ్యులు నాయకులంతా పాల్గొన్నారు.
