ఘనంగా సలపల వాగులో
దండారి దర్బార్ ఉత్సవాలు.
![]() |
| దండారి దర్బార్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆత్రం సక్కు. |
![]() |
| దండారి వేషధారణతో ఎమ్మెల్యే ఆత్రం సక్కు. |
![]() |
Scv News Kasipet:--
కాసి పేట మండలం మద్దిమాడ పంచాయతీ పరిధిలోని సల్పాల వాగు వెంకటాద్రి దేవాలయం సమీపంలో దండారి దర్బార్ ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల తో పూజలు నిర్వహించారు. గుస్సాడి కళాకారులతో కోలాటం నిర్వహిం చారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. ఎత్మ సార్ దేవతలకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన కళాకారులతో కలిసి డప్పులు కొడుతూ కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో మద్దిమాడ సర్పంచి, నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆడే జంగు, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు తుడుందెబ్బజిల్లా నాయకులు అనంతరావు, హనుమంతు, మండల కమిటీ నాయకులు ఆత్రం జంగు, మడవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



