ధర్మరావుపేటలో మహిళల
కు రఘపతిరావు ట్రస్టు
ఆధ్వర్యంలో దసరా
కానుకగా చీరల పంపిణీ.
- మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సురేఖ చేతుల మీదుగా 1250 మంది మహిళలకు అందజేత.
![]() |
| ధర్మారావు పేట లో రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపంణి చేస్తున్న ప్రేమ్సాగర్ రావు. |
కాసిపేట మండలంలోని ధర్మారావు పేట గ్రామంలో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా 1250 మంది మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేశారు.కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వగ్రామమైన ధర్మారావు పేట గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఐదు గ్రామ పంచాయతీ లకు సంబంధించి 1250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రేమ సాగర్ మాట్లాడుతూ కాసిపేట మండలం తమ స్వగ్రామని, నిత్యం సేవ కార్యక్రమాలను ఇక్కడ కూడా చేస్తామని స్పష్టం చేశారు.రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, జిల్లా వ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరిస్తా మని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ, మాజి అధ్యక్షుడు సిద్ధం తిరుపతి ఎంపీటీసీలు పార్వతి మల్లేష్ , మడావి భీం రావు సీనియర్ నాయకులు మెరుగు శంకర్, కనకరాజు, ఏనుగు జనార్థన్ రెడ్డి,భారతాని సతీష్,ప్రభాత్ రావు , జయరాం గోలేటి స్వామి, జాడి శంకర్,గాదం గట్టయ్య,మైదం రమేష్, గోపు శ్రీనివాస్ , రాజమౌళి చారి మహేష్ ఖదీర్ , మహేష్, చిలకయ్య,, పాల్గొన్నారు.

