మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న తుడుం దెబ్బ నాయకులు

 మల్కపల్లి   ఆశ్రమ పాఠశాల నుండి  అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత.

 మలకపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్ఎం ప్రశ్నిస్తున్నాం ఎంపీటీసీ భీమ్రావు.

 ఐటీడీఏ అధికారులకు తాసిల్దార్ కు  ఫిర్యాదు చేస్తున్న మండల తో దెబ్బ నాయకులు. 


Scv News Kasipet:--

 కాసిపేట మండలం మలకపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుండి ఈరోజు మంగళవారం  ఉదయం నాలుగు గంటలకు గుర్తు తెలియని వ్యక్తి బియ్యం తరలిస్తుండగా  తుడుందెబ్బ మండల కమిటీ నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బియ్యం అక్రమంగా తరలిపోవడం లో వార్డెన్, హెచ్ ఎమ్  మహేశ్వర్ రెడ్డి  హస్తముందని తుడుందెబ్బ నాయకులు ఆరోపిస్తున్నారు. వీరికి సహకరించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఐ టి డి ఎ డి టి డబ్ల్యూ, తాహసిల్దార్ ఫిర్యాదు చేశారు. బియ్యం మాయమైన విషయమై తాహ సిల్దార్, ఐటీడీఏ అధికారులు విచారణ చేపట్టారు. బియ్యం తరలింపు కారకులు  అవుట్సోర్సింగ్  గా పనిచేస్తున్న వర్కర్, వాచ్ మెన్ ను  తొలగించాలి డిమాండ్ చేయడం జరిగింది. లేని యెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగు తుందని హెచ్చరించారు. అధికారుల విచారణలో  స్థానిక ఎంపీటీసీ భీమ్ రావు, తుడుందెబ్బ జిల్లా నాయకులు పెంద్రం హనుమంతు, మండల ప్రధాన కార్యదర్శి మడవి వెంకటేష్ తదితరులు పాల్గొని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయు లను ప్రశ్నించారు.