రొట్టెపల్లి పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ.
ScvNewsKasipet:--
రొట్టె పల్లి పంచాయతీలో బతుకమ్మ చీరలు పంచుతున్న గ్రామ సర్పంచ్ కవిత, హనుమంతు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ఎంపీటీసీ భీమ్ రావు.
కాసిపేట మండలం రోట్టెపల్లి పంచాయతీ లో ఈరోజు దసరా పండుగ పురస్కరించుకుని బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ కేంద్రం కవిత హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీటీసీ బీమ్ రావ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రోడ్డ రమేష్, అల్కా పెద్దులు, అల్కా రాజు, వార్డు సభ్యులు మడావి రాధా, పోగుల స్వర్ణలత , కో ఆప్షన్ సభ్యుడు చిక్రం భీమ తదితరులు పాల్గొన్నారు.