మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బాదు గూడెంలో శ్రమదానం.

సోనాపూర్ పంచాయతీ బాదుగూడెంలో శ్రమదానం.

 - డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించాలని గిరిజనుల వినతి.

- మిషన్ భగీరథ పైపు లీకేజీతో రహదారి బురదమయం.

 మాట్లాడుతున్న బాధుగూడెం పటేల్ మానుకు.


 బాదు గూడ గ్రామస్తులు శ్రమదానం తో రహదారిని శుభ్రం చేసుకుంటున్న దృశ్యం. 

 బాదు గూడెం గ్రామం.


Scv News Kasipet:--

కాసిపేట మండలం సోనాపూర్ పంచాయతీ పరిధిలోని బాదుగూడెం గిరిజనులు ఈరోజు శ్రమదానం చేసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేసుకున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ వల్ల గ్రామంలోని ప్రధాన రహదారి బురదమయం అయింది. రహదారిపై స్కూలుకు వెళ్లే పిల్లలకు పెద్దలకు వాహనదారులకు చాలా ఇబ్బంది జరుగుతోంది సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ గిరిజన నాయకుడు మానుకు మాట్లాడుతూ బంగారు తెలంగాణ తెచ్చాను అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మభ్య పెట్టడమే తప్ప ఏమీ చేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక అందరికీ డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాం అన్న హామీ ఎనిమిది ఏండ్లు గడుస్తున్నా అమలు కావడం లేదని అన్నారు. పేద గిరిజనులంతా గున పెంకలు,పూరి గుడిసెల్లో నివసిస్తున్నామని వర్షాకాలంలో గుడిసెల వర్షం నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.     ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు జోక్యం చేసుకొని  ఆదివాసి గుడాలకు మౌలిక వసతులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయించి ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కనక తిరుపతి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, కనక మానుకు ఆదివాసి సంఘ నాయకులు, సిడం లక్ష్మీబాయి, సహక టి చూరూబాయ్, సహకటి దృపద భాయ్ పెంద్రం భాగ్య చాకటి రంభ తదితరులు పాల్గొన్నారు.