ప్రజా నాయకుడు రఘుపతి
రావు వర్ధంతి సందర్భంగా
అన్నదానం.
![]() |
| రఘుపతి రావు వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రే ఘాడ్ గ్రామంలో కొక్కిరాల రఘుపతి రావు 10వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా అయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఓరియంట్ కార్మిక సంఘం, సహకార సంఘం అధ్యక్షుడిగా అయన మండలంలో అనేక సేవా కార్యక్రమాల ను నిర్వహించరని,ఆదివాసీగూడెంలో ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణాలను నిర్మించి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.అయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని అన్నారు.ఎంపీటీసీలు భీమ్ రావు, మల్లేశ్, మాజీ మండల అధ్యక్షుడు తిరుపతి, మాజీ సర్పంచ్లు ప్రబాత్ రావు, శంకర్, నాయకులు కనక రాజు, గట్టయ్య, దేవయ్య మహేష్, గోలేటి స్వామి, శివ, రమేష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
