మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్దనపల్లి రైల్వే స్టేషన్ లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు

 అక్రమ నిర్మాణాలపై చర్యలు

తీసుకోవాలని సర్పంచి,

కౌన్సిలర్  తాహసిల్దార్ కు

ఫిర్యాదు.

 పెద్దనపల్లి రైల్వే స్టేషన్ లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తున్న సర్పంచ్ వేముల కృష్ణ, బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ రాముల 

 పెద్దనపల్లి రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.

Scv News Kasipet:--

కాసిపేట మండల రెవెన్యూ పరిధిలోని  పెద్దనపల్లి  రైల్వే స్టేషన్ (మైక్రో స్టేషన్) వద్ద గల ప్రభుత్వ భూమిలో ఎదేచ్చగా అక్రమ కట్టడాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఈరోజు పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ, బెల్లంపల్లి మునిసిపల్ తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ భూక్య రాము నాయక్ తహసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అక్రమ నిర్మాణాలపై ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై జిల్లా అధికారులు మండల రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు తొలగించాలని తలాన్ని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవాలని  సర్పంచ్ వేముల కృష్ణ కౌన్సిలర్ భూక్య రాము నాయక్ కోరారు.