మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కొండాపూర్ యాప చౌరస్తాలో కొమురం భీం 82 వ వర్ధంతి కార్యక్రమం.

 ఘనంగా కొమరం భీమ్ 82 వ వర్ధంతి కార్యక్రమం.

 కొండాపూర్ యాప లో కొమురం  భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎంపిపి రోడ్డ లక్ష్మి 

 కొమురం భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న తుడుందెబ్బ, అంబేద్కర్ సంఘాల నాయకులు.




 కొమరం భీమ్ 82 వ వర్ధంతి సందర్భంగా అభివాదం తెలుపుతున్న తుడుందెబ్బ నాయకులు. 




Scv News Kasipet:--

 కాసిపేట మండలం కొండాపూర్ 

చౌరస్తా యాప లో ఈరోజు తాటి గూడెం ఏకలవ్య యూత్  ఆధ్వర్యంలో కొమరం భీమ్ 82 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాలతో పూజలు నిర్వహించి జెండాను ఎగరవేశారు. చౌరస్తాలోని కొమురం భీం విగ్రహానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ రోడ్డ లక్ష్మి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడే జంగు, జిల్లా నాయకులు కురిసింగ హనుమంతు, మండల శాఖ అధ్యక్షుడు ఆత్రం జంగు, ఏకలవ్య నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు మడవి వెంకటేష్, అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్, సామాజిక చైతన్య వేదిక మండల అధ్యక్షుడు పల్లె మల్లయ్య, తుడుందెబ్బ మండల మహిళా కమిటీ సభ్యులు పూలమాలలు వేశారు.

తదనంతరం ఎంపీపీ రోడ్డ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం ప్రాణాలర్పించిన కొమురం భీము స్ఫూర్తిగా తీసుకుని గిరిజన సంఘాలు పనిచేయాలన్నారు. తుడుందెబ్బ జిల్లా నాయకుడు హనుమంతు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం కొమురం భీము నైజాం ప్రభుత్వంపై పోరాడి ప్రాణాలర్పిం చారన్నారు. ఇప్పటికీ ఆదివాసుల కు ప్రస్తుత ప్రభుత్వాలు గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను అమలు చేయడంలో విఫలమ య్యారని అన్నారు.తమ సమస్య ల పరిష్కారం కోసం గిరిజన చట్టా ల అమలుకై గిరిజన సంఘాలన్నీ ఐకమత్యంతో పోరాడాలని పిలుపు ఇచ్చారు.తుడుందెబ్బ మండల శాఖ అధ్యక్షుడు ఆత్రం జంగు మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్  కోసం కొమురం భీము ప్రాణాల ర్పించార న్నారు. ప్రతి ఏటా కొమురం భీము పోరాటాన్ని గుర్తుచేసు కుంటూ వర్ధంతి కార్యక్రమాలు ఘనం గా జరుపుకోవాలని అన్నారు. ఏకలవ్య యూత్  అధ్యక్షుడు వెంకటేష్ మాట్లా డుతు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ  వందన సమర్పణ చేశారు.