మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించకపోతే 48 గంటల్లో విద్యార్థులతో కలెక్టరేట్ తాసిల్దార్ కార్యాలయం ముట్టడి.
- MSP జిల్లా ఇంచార్జ్ కల్వల శరత్
Scv News Kasipet :-
మోడల్ స్కూల్ లో వంట వండుతున్న ఎం ఎస్ పి జిల్లా ఇన్చార్జి కలవల శరత్.
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మధ్యాహ్న భోజనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది.
మండల కేంద్రంలో మోడల్ స్కూల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎం ఎస్ పి జిల్లా ఇంచార్జ్ కలవల శరత్ కుమార్ వంటలు వండి విద్యార్థులకు పెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నూటికి 99 శాతం మా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల చదువు తున్నారని, ప్రభుత్వం మధ్యాహ్న భోజనం బిల్లులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెకు వెళ్లడం జరిగిందన్నారు.సమ్మెలో పాల్గొనడం వలన ఒక పూట విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని,ఈ ప్రభుత్వం తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బిల్లుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే 48 గంటల్లో అన్ని ప్రభుత్వ పాఠశాల లను కలుపుకొని కలెక్టర్ తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం తిరుపతి ఎమ్మార్పీఎస్ నాయకుడు దాసరి వినయ్ రవితేజ పాల్గొనడం జరిగింది.