కొండాపూర్ లో తుడుందెబ్బ సమావేశం.
![]() |
| కొండాపూర్ యాప లో తుడుందెబ్బ నాయకుల సమావేశం |
Scv News Kasipet:--
కాసిపేట మండలం కొండాపూర్ యాప గ్రామంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల కమిటీ సమావేశం జరిగింది. తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకుఈ నెల 30న ఆదివాసీ గ్రామాల్లో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాలని పటేలు, పూజారులు అంతా పాల్గొనాలని తీర్మానించారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు ఈ కార్యక్రమంలో సోయం జంగు రాష్ట్ర కార్యదర్శి, కనకరాజు జిల్లా ఉపాధ్యక్షుడు, మడావి వెంకటేష్ మండల ప్రధాన కార్యదర్శి, పెంద్రం ప్రభాకర్ కోశాధికారి, మోతీ రామ్ మండల ఉపాధ్యక్షులు, గంగారాం, చక్రం రాందాస్, సెడీమేక రాద, మడావి బొజ్జు తదితరులు పాల్గొన్నారు.
