సలపల వాగు భీమన్న
దేవాలయ అభివృద్ధికి
ఎమ్మెల్యే 5 లక్షల నిధుల
కేటాయింపు.
![]() |
| సలపల వాగు భీమన్న ఆలయాన్ని సందర్శించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. |
![]() |
| సలపల వాగు దాటి భీమన్న గుడి వద్ద కు వెళుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం మద్దిమాడ పంచాయతీ పరిధి లోని ఆదివాసుల ఆరాధ్యదైవం సల్పలవాగులోని భీమన్న ఆలయ అభివృద్ధి కోసం బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే ఫండ్ నుండి ఐదు లక్షల నిధులను కేటాయించారు. నిధులతో ఆలయ ఆవరణలో షెడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదివాసి సంఘాలు నిర్ణయించాయి. ఈరోజు భీమన్న దేవాలయాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్థానిక గిరిజన సంఘాల నాయకులతో సందర్శించా రు. సలపల వాగు దాటి భీమన్న గుడి వద్ద షెడ్డు నిర్మాణం పనులను పరిశీ లించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు స్వాగతం పలికిన వారిలో మద్దిమడ సర్పంచ్ ఆడజంగు, దేవపూర్ సర్పంచి మడావి తిరుమల, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం హనుమంతు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, గిరిజన నాయకులు రాందాస్, సోయం సూరు,కనక గోవర్ధన్, మాడవి గోపాల్, బింగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

