సోనాపూర్ రేషన్ డీలర్ ను
తొలగించాలని తుడుందెబ్బ
డిమాండ్.
![]() |
| రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన డీలర్ ను తొలగించాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న గిరిజన సంఘాల నాయకులు. |
![]() |
| అక్రమంగా తరలించిన రేషన్ బియ్యం పై విచారణ జరుపుతున్న తహసిల్దార్ దిలీప్ కుమార్, రెవెన్యూ బృందం. |
Scv News Kasipet :--
కాసిపేట మండలం సోనాపూర్ పంచాయితీ రేషన్ డీలర్ ను తొలగించాలని ఆదివాసీ పోరాట హక్కుల సమితి తుడుందెబ్బ డిమాండ్ చేసింది. రేషన్ షాప్ ద్వారా గిరిజనులకు పంచాల్సిన 20 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా టాటా ఏసీ లో తరలిస్తుండగా మంగళవారం రాత్రి గ్రామస్తులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.గతంలో ఎన్నో సార్లు డీలరు అక్రమాలకు పాల్ప డుతూ పేదలకు బియ్యం సరిగా పంపిణీ చేయడం లేదని ఫిర్యాదు చేసిన సంబంధిత రెవెన్యూ అధికారు లు సరిగా స్పందించ లేదని తుడుం దెబ్బ నాయకులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా డీలర్ అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుకున్న సందర్భంగా వెంటనే తొలగించి వేరే వారికి చార్జి అప్ప జెప్పాలని ఒక ప్రకటనలో కోరారు. గ్రామస్తులు పట్టుకున్న రేషన్ బియ్యం పై ఈరోజు తాహసిల్దార్ దిలీప్ కుమార్ సోనాపూర్ లో విచారణ చేశారు. విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటామని తాత్కాలికంగా వేరే డీలర్ కు చార్జ్ ఇవ్వడం జరుగుతుం దని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచి సుశీల, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు, ప్రధాన కార్యదర్శి మడావి వెంకటేష్, నాయక్ పోడ్ సేవా సంఘం మండల శాఖ అధ్యక్షుడు బద్ది శ్రీను, గిరిజన సంఘాల నాయకులు డీలర్ ను తొలగించాలని వినతిపత్రం అందజేసారు.

