మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రావణాసురుడి దిష్టి బొమ్మను దాహనం చేయవద్దని తుడుందెబ్బ డిమాండ్.

 మూలవాసుల 

చక్రవర్తి  రావణాసురుడి 

దాహన కార్యక్రమం

నిర్వహించవద్దని

తుడుందెబ్బ వినతి .

 రావణాసురుడి దహన కార్యక్రమం నిలిపివేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న తుడుందెబ్బ నాయకులు.
ScvNewsKasipeta:--

 ఈ దేశ మూలవాసుల చక్రవర్తి ఆదివాసీల ఆరాధ్య దైవం రావణా సురుడి దహన కార్యక్రమం నిర్వహించ వద్దని మండల తుడుందెబ్బ నాయకు లు డిమాండ్ చేశారు.కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు  ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో  దేవపూర్ ఓరియం ట్ కాలనీ లోని మైదానంలో దసరా పండగ సందర్భంగా రావణ దహనం కార్యక్రమాన్ని నిలిపి వేయాలని మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రాన్ని అంద జేశారు. ఈ దేశ మూలవాసీ గిరిజనుల ఆరాధ్య దైవం  ద్రావిడ చక్రవర్తి అయిన రావణుని దహనం చేయడం వల్ల మా మనోభావా లు దెబ్బతింటాయని, మమ్ములను కించపరచడమే నని  ఆదివాసీ నాయకులు తాహసిల్దార్ కు విన్నవించారు. దేవాపూర్ లో రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తే ఊరు కునేది లేదని ఒకవేళ నిర్వహిస్తే  దాన్ని వ్యతిరేకి స్తూ రాస్తారోకో  ధర్నాలు చేయడం జరుగు తుందని హెచ్చరిం చారు. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వారిలో  తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతు, జిల్లా ఆదివాసి సంఘం అధ్యక్షుడు వెడ్మ కిషన్,మండల ప్రధాన కార్యదర్శి  మడావి వెంకటేష్, ఉపాధ్యక్షులు ఆత్రం సంజీవ్, కోశాధికారి, ప్రభాకర్, సహాయ కార్యదర్శి కుర్సింగ తిరుపతి, మహిళా నాయకురాలు సేద్మాక రాధ, నాయకు లు మడావి బీర్ షా, బారికి రావు, రాము, మారుతి  తదితరులు  పాల్గొన్నారు.