మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రక్తదానం చేసి ఆదివాసి మహిళ ప్రాణాలను కాపాడిన పాత్రికేయుడు మోతి రామ్.

 రక్తదానం చేసి ఆదివాసి

మహిళ  ప్రాణాలను

కాపాడిన పాత్రికేయుడు

మోతి రామ్.

 ఆదివాసి మహిళకు రక్తదానం చేస్తున్న పాత్రికేయుడు మోతి రామ్.
Scv News Kasipet:--

 మారుమూల గిరిజన ప్రాంతంలో నిరుపేద ఆదివాసి మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మగబిడ్డను ప్రసవించింది. తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. గ్రామాలలోని రక్తదానం చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రక్తదానం చేయాలని పలువురిని వేడుకు న్న రక్త దానం చేస్తే బలహీన పడతామని  అపోహల వల్ల ఎవరు ముందుకు రాలేదు. వారి అవస్థ తెలుసుకున్న 'ఘంటారావం' పత్రిక  విలేకరిగా పనిచేసే పాత్రికేయుడు మోతి రామ్ స్పందించి రక్తదానం చేసి మహిళా ప్రాణం కాపాడి పలువురి మన్న నలను  పొందాడు . వివరాలిలా ఉన్నాయి. కాసిపేట మండలం సోనాపూర్ పంచాయతీ పరిధిలోని బాదు గూడెం గ్రామానికి చెందిన కనకలక్ష్మి  పురిటి నొప్పులతో బాధపడుతూ ఈరోజు  మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి మగబిడ్డను ప్రసవించింది. పురిటి సమయంలో  రక్తస్రావం తీవ్రంగా జరిగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. తక్షణమే రక్తం ఎక్కించాలని డాక్టర్లు సూచించారు. భర్త శ్రీనివాస్ రక్త దాతల కోసం చాలా మందిని సంప్రదించిన ఎవరు ముందుకు రాలేదు. గిరిజన గూడ లలో రక్తదానం పై అవగాహన లేకపోవడం, రక్తం ఇస్తే బలహీన పడతామని మూఢనమ్మకాలు ఉండడంవల్ల ఎవరు ముందుకు రాలేదు. భార్య పరిస్థితి ఆందోళ నకరంగా ఉండ టంతో  శ్రీనివాస్ ఆమెను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. చివరకు పాత్రికేయుడు మోతీ రామును సంప్రదించాడు. రక్తదానం చేసేందుకు  మోతీ రామ్ సుముఖత వ్యక్తం చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేసి కనకలక్ష్మి ప్రాణం కాపాడాడు. రక్తదానం చేసి నిరుపేద గిరిజన మహిళను కాపాడిన మోతీ రామును సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియాతో పాటు మండలంలో పలు వురు అభినందనలు తెలిపారు.