మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పేద పిల్లలకి అమ్మ ఒడి చేయూత

 పెద్దనపల్లి  న్యూ కాలనీకి 

చెందిన పేద పిల్లలకి 'అమ్మ

ఒడి' స్వచ్ఛంద సంస్థ 

చేయూత.

 అమ్మ ఒడి  స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు  అజ్మీరా మోహన్  పెద్దన పెళ్లి న్యూ కాలనీ లోని పేద పిల్లలకు పాఠశాలలో చేర్పించిన ఫోటో.
  

 పెద్దన పల్లి పంచాయతీ న్యూ కాలనీ లోని అమ్మ ఒడి స్వచ్ఛంద సంస్థ సహాయం చేసిన హరిప్రియ కుటుంబాన్ని పరామర్శిస్తున్న సర్పంచ్ వేముల కృష్ణ.

Scv News Kasipeta:--

కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ  సోమగుడెం న్యూ కాలనీ కి చెందిన హరిప్రియ కి మెదడులో రక్తం గడ్డ కట్టి కళ్ళు కనిపించకపోవడంతో అమ్మ ఒడి ఫౌండర్ అజ్మిరా మోహన్ గతంలో  వారికి చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు మరియు మూడు నెలలకు సరిపడే సరుకులు అందజేసిన విషయం తెలిసిందే.

ఈరోజు వారి ఇద్దరి పిల్లల పూర్తి చదువు బాధ్యత అమ్మ ఒడి వారు తీసుకుంటున్నట్టు ఫౌండర్  మోహాన్ తెలిపారు,ఈ సందర్బంగా మోహన్ స్థానిక సర్పంచ్ వేముల కృష్ణ సమక్షంలో  వారిని బడిలో చేర్పించి వారికి పుస్తకాలు, బ్యాగులు,మరియు వారికి సంవత్సరానికి చదువుకు అవసరమయ్యే వస్తువులు కొనిచ్చారు.అలాగే అమ్మ ఒడి ఫౌండర్ మోహన్ మాట్లాడుతూ  ఇద్దరు పిల్లలు ఎంత వరకు చదివితే అంతవరకు చదివించే పూర్తి బాధ్యత తమదేనని తెలిపారు, అలాగే హరిప్రియ మందుల కోసం పది వేల రూపాయలు అందించారు.ఈ కార్యక్రమంలో పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,మరియు అమ్మ ఒడి సభ్యులు పాల్గొన్నారు.