ఓరియంట్ బాధిత ఆదివాసిలకు జరిగిన అన్యాయం -12
జీవనాధారమైన భూమిని
కోల్పోయి, పరిహారం కోసం
30 ఏళ్లుగా ఎదురు
చూస్తున్న కోవ మాన్కు
వారసులు.
- 16 ఎకరాల భూమిని మొత్తం స్వాధీనం చేసుకుని 4 ఎకరాలకు పరిహారం, ఉద్యోగాలు ఇచ్చి మిగతా భూమి తమ ఆధీనంలో లేదంటున్నారు ఓరియంట్.
- 12 ఎకరాల భూమికి పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని నిర్వాసిత ఆదివాసుల వేడుకోలు.
- న్యాయం కోసం కోర్టును ఆశ్రయించి భూములను కొల్పించుకున్న బాధితులు.
- జిల్లా సర్వే అధికారి కొలతల్లో భూమి ఓరియంట్ ఆధీనంలో ఉందని తేలి 10 ఏళ్లు గడుస్తున్నా పంచనామ కాఫీలు నిర్వాసితులకు అందివ్వడంలో తీవ్ర జాప్యం.
![]() |
| ఓరియంట్ లో భూములు కోల్పోయిన కోవా మాన్కు వారసులు. |
Scv News Kasipet:--
నైజాం ప్రభుత్వ హాయంలో జీవనాధారం కోసం ఇచ్చిన 16 ఎకరాల భూమి లో వర్షాధార పంటలు జొన్న, కంది, పెసర, ఆముదం లాంటి పంటలు పండించుకుని కోవా మాన్కు కుటుంబం దశాబ్దాలుగా హాయిగా జీవనం సాగించింది. దేవాపూర్ పరిసర ప్రాంతంలోని అపారమైన సున్నపురాయి నిల్వలు ఆధారంగా 1979లో బిర్లా యాజమాన్య ఓరియంట్ సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేసింది. కర్మాగార నిర్మాణంలో తన భూమిమొత్తాన్ని కోల్పోయాడు. కోల్పోయిన 16 ఎకరాల భూమిలో 4 ఎకరాలకు మాత్రమే పరిహారం, ఇద్దరికీ ఉద్యోగాలు ఇచ్చి ఓరియంట్ యాజమాన్యం చేతులు దులుపుకున్నారు. మిగతా 12 ఎకరాల భూమి కి ఇంతవరకు పరిహారం అందలేదు. భూమికి పరిహారం చెల్లించాలని యాజ మాన్యన్ని సంప్రదిస్తే 'మీ భూమి తమ ఆధీనంలో లేదని సమీపంలో ని అడవిలో గుట్ట లో ఉన్నది కావచ్చు' అంటూ ఓరియంట్ యాజమాన్యం బుకాయిస్తుంది. 'ఒకే సర్వే నంబరు మీద ఉన్న 16 ఎకరాలలో నాలుగు ఎకరాలు మీ ఆధీనంలో ఉండి మిగతా 12 ఎకరాలు అడివిలో గుట్టల్లో ఎలా ఉంటాదాని' అమాయక ఆదివాసి కుటుంబం వేసే ప్రశ్నలకు ఓరియంట్ యాజమాన్యం వద్ద సమాధానం లేదు.
పరిహారం, ఉద్యోగాల కోసం గత 30 ఏళ్లుగా మాన్కు వారసులు రెవెన్యూ కార్యాలయం, ఓరియంట్ యాజమాన్యం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. కోల్పోయిన భూమి కింద తమ కుటుంబాలను పోషించు కునేందు కు కనీసం దినసరి కూలీ పనులన్న ఇచ్చి ఉపాధి చూపాలని వేడుకున్నా కనికరించడంలేదు. ప్రస్తుతం జీవనాధారమైన భూమిని కోల్పోయి,పరిహారము ఉద్యోగాల్లేక, మాన్కు కుటుంబ వారసులు కడు పేదరికంలో జీవనం సాగిస్తూన్నారు. వారి కుటుంబానికి జరిగిన అన్యాయం పై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది...
కాసిపేట మండలం దేవాపూర్ పంచాయతీ పరిధిలోని పెద్దగూడెంలో కొవ మాన్కు కుటుంబం నివసించేది. నైజాం ప్రభుత్వం హాయంలో సర్వే నెంబర్ 84 /63 ఇచ్చిన 16 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ వర్షాధార పంటలు వేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారు. అతనికి బాపురావు సోము అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. 16 ఎకరాల భూమిని తన హయాంలో ఇద్దరికీ చెరి 8 ఎకరాలు పంపిణీ చేసి వారి పేరిట పట్టాలు చేయిం చారు. ఓరియంట్ కర్మాగార నిర్మాణం లో మొత్తం భూమి కోల్పోయారు.
కోవా బాపు రావు కు గంగారాం, లింగు, మానిక్ రావు, చిన్న గంగారాం అనే నలుగురు కుమారులు ఉన్నారు. కోవా సోముకు మాణిక్ రావ్, సుగుణ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కర్మాగా రం నిర్మాణంలో బాపు రావు,సోముకు చెందిన చెరి రెండు ఎకరాలు మొత్తం నాలుగు ఎకరాల భూమిని కోల్పోయారు. రెవెన్యూ యాజమాన్యం ఇచ్చిన అవార్డు సిఫారసు మేరకు ఓరియంట్ యాజమాన్యం p నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించి కోల్పోయిన భూమి కింద బాపు రావు పెద్ద కుమారుడు గంగారం కు, సోము ఏకైక కుమారుడు మాణిక్ రావు కు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. మిగతా 12 ఎకరాల భూమికి పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే తమకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులను అడగాలని యాజమాన్యం తప్పించుకుం టుందని కోవా మాన్కు వారసులు వాపోతున్నారు. మిగతా 12 ఎకరాల భూమి లో వ్యవసాయం చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుని జీవనోపాధి పొందేందుకు బాపురావు వారసులు లింగు, మాణిక్ రావ్, చిన్న గంగారాం లు ఓరియంట్ ఆధీనంలోని భూమి లోకి వెళ్తే మీ భూమి ఇక్కడ లేదు మేము రెవెన్యూ శాఖ ద్వారా కొనుగోలు చేశామని గిరిజనుల భూమి చుట్టూ ఓరియంట్ యాజమాన్యం గోడలు కట్టుకుని లోనికి రానివ్వడం లేదు.
ఓరియంట్ ఆధీనంలోని తమ భూమి వివరాలు తెలుసు కునేందుకు కోవా లింగ్ జిల్లా సర్వే అధికారులతో భూమిని కొల్పించేం దుకు 2000 సంలో చాలన్ కట్టాడు. చాలన్ నెంబర్ 15 248 తేదీ 22. 9.2000 . చాలన్ కట్టిన ఓరియంట్ యాజమాన్యం ఒత్తిడి తో రెవెన్యూ శాఖ, సర్వే అధికారులు కొలిచేందుకు ముందుకు రాలేదు. నిర్వాసిత రైతులంతా హైకోర్టును ఆశ్రయించడం తో రీ సర్వే చేసి నిర్వాసిత ఆదివాసి రైతుల భూములు వివరాలు వెల్లడించాలని కోర్టు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు కోవా లింగు భూమి ని 13. 12.2010 లో కొలిచారు. 12 ఎకరాల భూమి ఓరియంట్ యాజమాన్యం ఆధీనంలోనే ఉన్నట్లు తేలింది. సర్వే పూర్తయి 11 ఏళ్లు గడుస్తున్నా పంచనామ కాఫీలు సర్వే అధికారులు ఇవ్వడం లేదని లింగు వాపోతున్నారు. జిల్లా సర్వే అధికారులు సర్వే చేసిన నిర్వాసిత రైతుల భూముల పంచనామ కాఫీలు అందజేయాలని ఓరియంట్ ఆధీనంలో ఉన్న తమ భూములకు నష్ట పరిహారం చెల్లించాలి కోవ మాన్కు వారసులు జిల్లా కలెక్టర్ ను, గుర్తింపు కార్మిక సంఘం, ఎమ్మెల్యే ను వేడుకుంటూన్నారు.
